కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

విశాల్ 'చక్ర' తెలుగు పోస్టర్ రిలీజ్..!

ఫస్ట్ లుక్1 ని. చదువు

విశాల్ 'చక్ర' తెలుగు పోస్టర్ రిలీజ్..!

Vishal Chakra Movie Poster Is Out

ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా చక్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో వచ్చిన అభిమన్యుడు చిత్రానికి సీక్వెల్ గా అన్నట్టు తెలుస్తుంది. ఇంకా వారం రోజులు షూటింగ్ మాత్రమే మిగులుందని ఇప్పటికే విశాల్ చెప్పాడు. ‌ఇక షూటింగ్ లు మొదలవుతున్నాయి కాబట్టి అది కూడా పూర్తి చేసి తొందరలోనే రిలీజ్ చేసే ప్లాన్ చేయాలని చూస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా తెలుగు పోస్టర్‌ను ఆ చిత్ర బృందం విడుదల చేసింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశాల్‌ పవర్ ఫుల్‌ పాత్రలో రఫ్‌గా కనపడనున్నాడు. చేతిలో చక్రంతో ఆయన ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంటుంది.

విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ స్వయంగా నిర్మిస్తుండగా శ్రద్దా శ్రీనాధ్, రెజీనా కాసాండ్రా, శ్రుతీ డాంగే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా రోబో శంకర్‌, కేఆర్‌ విజయ, మనోబాలా, విజయబాబు తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్