నాని హీరోయిన్ కోసం పెద్ద లిస్ట్..!

Shyam Singha Roy Movie Makers In Search Of Heroine To Play The Lead Role Opposite Nani In The Movie

గత ఏడాది గ్యాంగ్ లీడర్ సినిమా తో వచ్చిన నాని ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు. పరిస్థితులు బాగుండి ఉంటే ఇప్పటికే ఒక సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు మరో సినిమా కూడా రిలీజ్ సిద్ధంగా ఉండేది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని హీరో గా నటించిన ‘వి’ సినిమా ఉగాది పండుగ రోజు మార్చి 25 న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ లు వాయిదా పడ్డాయి. ఆ సినిమానే ఇప్పటి వరకూ నోచుకోలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీనితో పాటు శివనిర్వాణ దర్శకత్వంలో నాని ‘టక్‌ జగదీష్’ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తుండగా.. . థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూట్ కు కూడా బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌తో కలిసి ‘శ్యామ్ సింగరాయ్‌’ అనే సినిమా నాని చేస్తున్నట్టు ప్రకటించేశాడు.సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. లేదంటే ఇప్పటికే సెట్స్‌పై ఉండేది.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్స్ పై రోజుకో వార్త వస్తుంది. లాక్ డౌన్ ముందే సాయి పల్లవి పేరు తెరపైకి వచ్చింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో హీరోయిన్ పేరు కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న రష్మిక మందన్న. రష్మిక మందన్న కూడా ఈ మరో హీరోయిన్ గా నటించనుందట. నిజానికి ఈ సినిమాలో కూడా నాని మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు హీరోయిన్స్ కూడా ఉండొచ్చు అన్న టాక్స్ నడుస్తున్నాయి. ఈ ముగ్గురి కోసం ఇప్పటికే ఆరుగురిని సెలక్ట్ చేశారని, అందులో నుంచి ముగ్గురుని ఫైనల్ చేసే పనిలో ఉన్నారని టాక్. రష్మిక మందన్న, రాశీ ఖన్నా, సాయిపల్లవి, నివేథా ధామస్, నిధి అగర్వాల్, రీతూ వర్మల పేర్లు ఈ చిత్రం కోసం సెలక్ట్ చేసుకున్నారని, ఇందులో ముగ్గురిని ఫైనల్ చేయనున్నారని అంటున్నారు. మరి ఈ వార్తలు ఎంత వరకూ నిజమో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =