రెడీ గా ఉన్నా.. వారి ఫోన్ కోసం వెయిట్ చేస్తున్న..!

Pelli Choopulu Fame Heroine Ritu Varma Looking Forward Eagerly To Join Movie Shooting

లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ లు, సినిమా రిలీజ్ లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వం కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో చిన్నగా షూటింగ్ లు మొదలుపెట్టాలని చూస్తున్నారు. మరోవైపు రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్పుడే షూటింగ్ లకు వెళ్ళకూడదని కూడా ఆలోచిస్తున్నారు. అందరూ ఆగష్ట్ నుండే షూటింగ్ లకు వెళ్లాలని చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్న కొంతమంది హీరో హీరోయిన్స్ మాత్రం ఎప్పుడు షూటింగ్ లకు వెల్దామా అని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చూపులు హీరోయిన్ రీతూ వర్మ షూటింగ్ కు వెళ్ళడానికి రెడీ గా ఉందట. ప్రస్తుతం రీతూ వర్మ తెలుగులో పలు సినిమాలతో బిజీగా ఉంది. శివనిర్వాణ దర్శకత్వంలో నాని ‘టక్‌ జగదీష్’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కరోనా వల్ల ఈ సినిమా షూట్ వాయిదా పడింది. దీనితో పాటు శర్వానంద్ హీరోగా తెలుగు తమిళ్ లో తెరకెక్కుతున్న ఒక సినిమాలో కూడా రీతూ నటిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా 70శాతం ముగిసింది. ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. ఈ రెండు సినిమాలతో పాటు నాగ చైతన్య కొత్త ప్రాజెక్ట్ లో కూడా రీతూ వర్మ ఎంపిక అయింది. ఈ నేపథ్యంలో ఇన్ని సినిమాలు లైన్ లో ఉండటంతో అమ్మడు ఎప్పుడు షూట్ మొదలవుతుందా అని చూస్తుంది. డైరెక్టర్స్ నుండి ఎప్పుడు ఫోన్ వస్తుందా అని ఎదురుచూస్తుందట.

ఇక పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా మారి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాతో రీతూ కు వరుస అవకాశాలు వస్తాయి అనుకున్నారు కానీ అది అవ్వలేదు. కానీ ఈ అమ్మడికి తమిళ్ లో మాత్రం వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా కనులు కనులు దోచాయంటే సినిమా కూడా హిట్ అవ్వడంతో మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 17 =