కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

మొదలైన 'సూపర్ మచ్చి' ఆఖరి షెడ్యూల్..!

మొదలైన 'సూపర్ మచ్చి' ఆఖరి షెడ్యూల్..!

Mega Star Son In Law Kalyan Dev New Movie Super Machi Enters Its Last Schedule

విజేత చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. అయితే మొదటి సినిమా అంత సక్సెస్ కాలేదు కానీ.. ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉండగా ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు దేవ్. టీవీ సీరియళ్ల దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడలో కూడా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో 'సూపర్ మచ్చి' అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా.. కన్నడలో ‘మీనాక్షి’ అనే టైటిల్‌ తో వస్తుంది.

ఇక ఇప్పటికే సగానికి పైగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇంకా ఒక్క షెడ్యూల్ మాత్రమే మిగిలివుంది. కరోనా వల్ల ఇన్ని రోజులు షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఫైనల్ షెడ్యూల్ షూట్ ను ప్రారంభించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ నిర్వహిస్తున్నామని చిత్రయూనిట్ పేర్కొంది.

కాగా ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ స‌ర‌స‌న క‌న్న‌డ బ్యూటీ ర‌చితా రామ్ హీరోయిన్‌గా నటిస్తుంది. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్