రూమర్స్ పై నయన్, విఘ్నేష్ ఫన్నీ రిప్లై..!

Actress Nayanthara and Director Vignesh Puts A Check To Social Media Rumours With A Funny Video

నయన్ సినిమా కెరీర్ గురించి అయితే ఎలాంటి ఢోకా లేదు. లేడీ సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకుంది. అయితే వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఏదో ఇక వార్త, ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ఇక తాజాగా వచ్చిన రూమర్ నయన్ కు కరోనా అన్న వార్తలు. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వణికిస్తుంది. ఇక ఇప్పుడు సడలింపులు కూడా చేయడంతో రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా నయనతార, విఘ్నేష్‌ శివన్‌లకు కూడా కరోనా వచ్చిందంటూ రెండు రోజులుగా కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి. దీనితో తన అభిమానులు నయన్‌ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా మెసేజ్‌లు కూడాపెడుతున్నారు. ఇక ఈ వార్తలపై నయన తార, విఘ్నేష్ శివన్ స్పందించి ఒక ఫన్నీ వీడియోతో రిప్లై ఇచ్చారు.


విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారి.. లేడీ సూపర్ స్టార్ గా దక్షిణాదిన దూసుకుపోతుంది నయనతార. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. తమిళ్‌లో నెట్రికన్‌, ముక్తి అమ్మాన్‌, అన్నాట్టే, కథువాకుల రెండు కాదల్ సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ. ముక్తి అమ్మాన్ సినిమాలో నయన్ మొదటిసారిగా అమ్మవారి పాత్రలో నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =