బిగ్ బాస్ 4 – ఫినాలే టికెట్ గెలుచుకున్న అఖిల్

Bigg Boss 4 Telugu,Bigg Boss 4 Telugu Day 89 Highlights, Akhil Wins Ticket To Finale,#BiggBossTelugu4, Akkineni Nagarjuna, BB House, Big Boss 4, bigg boss, Bigg Boss 4, Bigg Boss 4 Telugu Day 89, Bigg Boss Akhil Wins Finale Ticket , Bigg Boss 4 Telugu Nominations, Bigg Boss 4 Telugu Nominations List, Bigg Boss Telugu 4, Bigg Boss Telugu Season 4, Bigg Boss Telugu Season 4 Latest News, Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

బిగ్ బాస్ 4 – ‘రేస్ టు ఫినాలే’ టాస్క్ గత నాలుగు రోజుల నుండి జరుగుతూనే ఉంది. ఫైనల్లీ ఈ రోజు ఈ టాస్క్ ముగిసింది. మరి నిన్న ఎపిసోడ్ లో ఏం జరిగింది.. ఎవరు ఫినాలే టికెట్ ను సొంతం చేసుకున్నారు అన్నది తెలియాలంటే ఎపిసోడ్ లోకి వెళ్లాల్సిందే. మూడో టాస్క్ లో భాగంగా దాదాపు ఒక రోజు మొత్తం ఉయ్యాలలోనే వున్నారు అఖిల్, సోహెల్. ఉదయం అయినా పట్టు వదలకుండా ఉయ్యాలలోనే ఉండిపోయారు. ఇక ఇద్దరిలో ఎవరూ దిగట్లేదని ఇద్దరూ ఆలోచించుకోండి అని అభి సలహా ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ‘ఈ గేమ్ ఇద్దరికీ ఇంపార్టెంటే… మా అమ్మ వచ్చి కెప్టెన్ అవ్వు అని అడిగినా నేను కాలేకపోయా. నేనే టాప్‌ 5 ఉంటానని అమ్మకు చెప్పా. అదే కొంచెం భయంగా ఉంది’ అంటూ సోహైల్‌ని సెంటిమెంట్‌ తో కొట్టాడు. దీంతో సోహైల్‌ కూడా దిగిపోవడానికి రెడీ అయ్యాడు.. కానీ అఖిల్‌ వద్దని ఆపేసాడు. పర్లేదు నేను దిగుతా.. ఈ గేమ్ నాకు కూడా ఇంపార్టెంటే కానీ.. నీ కోసం నేను దిగుతా.. మనం సాయంత్రం వరకూ ఉండమన్నా ఉంటాం.. అది బిగ్ బాస్‌కి కూడా తెలుసు. నా భయం ఏంటంటే మళ్లీ బిగ్ బాస్ ఎలాంటి అనౌన్స్‌మెంట్ ఇస్తారో గేమ్ అటూ ఇటూ కాకుండా పోతుంది.. అని సోహెల్ అనడంతో అఖిల్ నేను నామినేషన్‌లో ఉన్నా.. ఒక వేళ నేను ఈ వీక్‌ ఎలిమినేట్‌ అయితే టికెట్‌ ఫినాలే వృధా అయిపోతుంది. అందుకే నువ్వే ఆ టికెట్‌ తీసుకో. నన్ను ఉయ్యాలలో నుంచి తోసెయ్‌ అని చెప్పాడు. దీంతో సోహైల్‌ మరోసారి ఎమోషనల్‌ అయి గట్టిగా ఏడ్చేశాడు. ఆ తర్వాత కొంచం జరుగు అని చెప్పి సోహైల్‌ ఒక్కసారిగా ఉయ్యాల నుంచి కిందిగి దిగేశాడు. దీంతో అఖిల్ టికెట్‌ టు ఫినాలే మెడల్ సాధించి టాప్ 5కి వెళ్లాడు.

ఆ తర్వాత నిన్న హారికతో జరిగిన గొడవను అభిజిత్‌ క్లియర్‌ చేసుకున్నాడు. నా విషయంలో ఒక స్టాండ్‌ తీసుకోలేవు అంటూ బాధపడ్డాడు. ఒక్కసారి కూడా నాకు హెల్ఫ్‌ చేయలేదని, నేను చెప్పిన విషయాలను కూడా సీరియస్‌ తీసుకోవని కొంచెం అసహనం వ్యక్తం చేశాడు. ‘నేను నీ ఫ్రెండ్‌గా చెప్తున్నా.. కొన్ని కొన్ని విషయాలను అర్థం చేసుకుని నీ ప్రాబ్లమ్ ఇదీ అని చెప్తావని చూస్తా. కానీ నువ్ స్టాండ్ తీసుకోవు’ అని అభిజిత్‌ బాధపడ్డాడు. అలాగే అఖిల్‌ గురించి మాట్లాడుతూ.. తాను నన్ను ఓరేయ్‌ అనొద్దని చెప్పినందుకు నామినేట్‌ చేశాడు. నేను ఎవరితో ఇలా మాట్లాడా అంటూ యాటిట్యూడ్‌ చూపించాడని చెపుతుంటాడు. సడన్‌గా అఖిల్‌ వచ్చి అభికి థ్యాంక్స్‌ చెప్పాడు. దీంతో కంగుతిన్న అభి.. నీ గురించే మాట్లాడుకుంటున్నామని చెప్పేశాడు.

అనంతరం ఇంటి సభ్యులకు ట్రూత్‌ ఆర్‌ డేర్‌ గేమ్‌ను పెట్టాడు బిగ్‌బాస్‌. అందరూ రౌండ్‌గా నిలబడి రియల్‌ మ్యాంగో డ్రింక్‌ తాగుతూ ఒకరి నుంచి ఒకరికి పాస్‌ చేయాలని, ఎవరిదగ్గరైతే మ్యాంగో డ్రింక్‌ అయిపోతుందో వాళ్లు ట్రూత్‌ అండ్‌ డేర్‌ గేమ్‌ ఆడాలని చెప్పాడు. ఫైనల్ గా ఈ గేమ్ లో హారిక గెలిచింది. ఇక మరోవైపు అవినాష్ కిచెన్లో‌ వంట చేస్తున్న ఇంటిసభ్యుల మీద బుర్ర కథతో ఒక్కొక్కరి మీద ఒక్కోరకంగా పొగడ్తలు కురిపించాడు. దీంతో ఇంటి సభ్యులంతా ఎమెషనల్‌ అయి.. అవినాష్‌ని హగ్‌ చేసుకున్నారు.

ఫైనల్ గా నెంబర్‌ గేమ్‌ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఉన్న ఏడుగురిలో ఆరుగురు సభ్యులు తాము ఏ స్థానానికి అర్హులమో చెప్పి.. ఆ నెంబర్ ముందు నిల్చోవాల్సి ఉంటుంది. అందులో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తిని బెస్ట్‌ ఫెర్మార్మర్‌ ఆఫ్‌ దీ సీజన్‌గా, చివరి స్థానంలో ఉన్న వారిని వరస్ట్‌ ఫెర్మార్మర్‌ ఆఫ్‌ది సీజన్‌గా ప్రకటిస్తానని బిగ్‌బాస్‌ ముందే అనౌన్స్‌ చేశాడు. టికెట్‌ టు ఫినాలే గెలినందున అఖిల్‌కు ఈ టాస్క్‌ నుంచి మినహాయింపు లభించింది .

ఇక ఉన్న మిగతా ఆరుగురిలో మొదటి స్థానంలో సోహైల్‌, రెండో స్థానంలో అరియానా, మూడో స్థానంలో హారిక, నాల్గో స్థానంలో మోనాల్‌, ఐదో, ఆరో స్థానాల్లో అవినాష్‌, అభిజిత్‌ నిలబడ్డారు. దీంతో బెస్ట్‌ ఫెర్ఫార్మర్‌గా సోహైల్‌ని, వరస్ట్‌ ఫెర్మార్మర్‌గా అభిజిత్‌ను ప్రకటించాడు బిగ్‌బాస్‌. అనంతరం ఈ సీజన్‌కి వరస్ట్‌ ఫెర్మార్మర్‌గా ఎన్నికైన అభిజిత్‌..జైలు శిక్ష అనుభవించాలని బిగ్‌బాస్‌ ఆదేశించారు. దీంతో అభిజిత్‌ ఖైదీ దుస్తులు ధరించి జైలుకి పంపించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − nine =