“కెజిఎఫ్ చాప్టర్ 2″మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

KGF2 Movie Teaser Release Date Finalized,KGF Chapter 2 Teaser,KGF Chapter 2 Teaser Release On Yash Birthday,Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Yash KGF Chapter 2 Teaser,Actor Yash Birthday,KGF 2 Teaser Date,KGF 2 Movie Teaser,Director Prashanth Neel,Yash Latest News 2020,KGF Chapter 2 Movie Updates

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” కన్నడ మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. “కెజిఎఫ్ చాప్టర్ 2 “మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరా పాత్రలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో యశ్ బర్త్ డే జనవరి 8వ తేదీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. “కెజిఎఫ్ చాప్టర్ 2 “మూవీ టీజర్ ను హీరో యశ్ బర్త్ డే రోజున రిలీజ్ చేయనున్నామని నిర్మాత కార్తీక్ గౌడ ప్రకటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న్నాయి. డిసెంబర్ నెలలో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి “కెజిఎఫ్ చాప్టర్ 2 “మూవీ ని 2021 సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “కెజిఎఫ్ చాప్టర్ 2 “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.