“ఆచార్య” మూవీలో రష్మిక

Actress Rashmika Mandanna,Rashmika To Play Female Lead In Chirnajeevi’s Acharya,Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Ram Charan Next Movie,Actress Rashmika New Movie,Acharya Next Upcoming Movie,Ram Charan Latest News 2020,Rashmika Mandanna New Movie Updates

తెలుగు , కన్నడ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తెలుగు , కన్నడ , తమిళ భాషలలో పలు ఆఫర్స్ అందుకుంటున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందనున్న “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు. ఇప్పుడు రష్మిక మరో భారీ తెలుగు మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా “ఆచార్య “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో రామ్ చరణ్ కు జోడీగా రష్మిక ఎంపిక అయ్యారు. ప్రస్తుతం “ఆచార్య “మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. హీరో రామ్ చరణ్ సంక్రాంతి పండగ తరువాత సెట్స్ లో జాయిన్ కానున్నారు. సంక్రాంతి పండగ తరువాత రష్మిక తన డేట్స్ ను ఇచ్చారు. రామ్ చరణ్ హీరోగా రూపొందే నెక్స్ట్ మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయిన విషయం తెలిసిందే. 2021 సంవత్సరం సమ్మర్ లో “ఆచార్య ” మూవీ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.