ఆర్ఆర్ఆర్ టీమ్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తూ బిజీగా షూట్ చేసే పనిలో పడ్డారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాలి. అసలే లేట్ అవ్వగా కరోనా వల్ల మరింత లేట్ అయింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూట్ ను మళ్లీ మొదలు పెట్టగా రాజమౌళి మాత్రం ఇక ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితమే దాదాపు 50రోజుల పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసి కంప్లీట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మహాబలేశ్వర్ లోని అందమైన లొకేషన్స్ లో ఒక చిన్న షెడ్యూల్ లో షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ కోసం లొకేషన్స్ సెర్చ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ షూట్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాల్గొననున్నారు.
View this post on Instagram
కాగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























