ఒరేయ్ బుజ్జిగా – మళ్లీ థియేటర్ రిలీజ్

Raj Tarun and Malvika Nair Starrer Orey Bujjiga, Orey Bujjiga All Set To Release In Theatres,Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Orey Bujjiga Movie release in theaters on Jan 1,Orey Bujjiga Telugu Movie,Raj Tarun Orey Bujjiga Movie Latest News,Raj Tarun Next Upcoming Movies,Orey Bujjiga Movie Updates

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’. ఈ సినిమాను ఆహా లో అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ చేశారు. థియేటర్స్ ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో ఓటీటీ లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ థియేటర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం థియేటర్స్ ‌ తెరచుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని థియేట‌ర్‌ల‌లో కూడా విడుదల చేసేందుకు చిత్రయూనిట్‌ రెడీ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సంద‌ర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్.. ”2021కి స్వాగ‌తం ప‌లుకుతూ నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా మా బేన‌ర్‌లో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్ ‌ హీరోహీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఒరేయ్ బుజ్జిగా..’ చిత్రాన్ని జ‌న‌వ‌రి 1న గ్రాండ్‌గా విడుద‌ల‌ చేస్తున్నాం.. అందరూ ఈ చిత్రాన్ని బిగ్‌ స్ర్కీన్‌పై చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం.. ” అని తెలిపారు.

కాగా ఈ సినిమాలో మాళవిక నాయర్‌ హీరోయిన్ గా నటించగా.. హెబ్బా పటేల్ కూడా కీలక పాత్రలో నటించింది. ఇంకా ఈ సినిమాలో నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 14 =