ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 11
ఫైనల్ షెడ్యూల్ కోసం 'గోవా' లో క్రాక్ టీమ్
పాయల్ రాజ్ పుత్ మనసులో మాట
"కరోనా వైరస్ " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
లిక్విడ్ డైట్ లో పవన్ కళ్యాణ్
హారర్ మూవీ లో కాజల్ అగర్వాల్
ఇండస్ట్రీ హిట్ "ప్రేమించుకుందాం రా !"

సెట్స్ లో నేను, పవన్ పట్టించుకోము
కాజల్-గౌతమ్ కిచ్లూ.. వన్‌మంత్ యానివర్సిరీ
మహేష్ ను ఆట పట్టిస్తున్న సితార
"విరాటపర్వం "సెట్స్ లో రానా దగ్గుబాటి
కె.జి.యఫ్ నిర్మాత మరో భారీ ప్లాన్
శృతి హాసన్ ఫొటో షూట్స్
విజయ్ దేవరకొండ పై అనన్య పాండే ప్రశంసలు
మళ్లీ ప్రభాస్ తో సినిమానా - ఇక చాలు
టాలీవుడ్ లో రీతూ వర్మ బిజీ
రష్మిక లేటెస్ట్ వర్కౌట్
తెలుగు , కన్నడ భాషల మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. 2020 సంవత్సరం లో రష్మిక కథానాయికగా నటించిన "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ " మూవీస్ ఘనవిజయం సాధించాయి. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందే "ఆడాళ్ళూ మీకు జోహార్లు "మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు. "సుల్తాన్ "మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగు పెడుతున్నారు.
నితిన్ పై రివేంజ్ తీర్చుకుంటా అంటున్న కీర్తి సురేష్
నితిన్ మీద రివేంజ్ తీర్చుకోడానికి సిద్ధంగా ఉంది కీర్తి సురేష్.. అంతేకాదు అందుకు నితిన్ ను కూడా రెడీ గా ఉండమంటుంది.. అసలు కీర్తి ఈ రివేంజ్ తీర్చుకోడానికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం దుబాయ్‌లో రంగ్ దే షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో షూటింగ్ మధ్యలో కీర్తీ సెట్లో రెస్ట్ తీసుకుంటుండగా ఆ సమయంలో నితిన్, వెంకీ అట్లూరి ఓ ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సంగతి కూడా విదితమే. అంతే కాకుండా 'షూటింగ్‌తో మాకు చెమటలు పడుతుంటే తను మాత్రం హ్యాపీగా రిలాక్స్ అవుతోంది' అని కామెంట్ కూడా చేశారు. అయితే ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఫైనల్ షెడ్యూల్ కోసం 'గోవా' లో క్రాక్ టీమ్
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న మూడో చిత్రం 'క్రాక్'. 'క్రాక్' తో హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నారు వీరిద్దరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో స్టార్ట్ చేయగా కొంత భాగం అక్కడ చిత్రీకరించారు. ఇక కొంతభాగం మిగిలిఉండగా ఇప్పుడు అది కంప్లీట్ చేయడానికి చిత్రయూనిట్ గోవా వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని రవితేజ తన ఇన్‌స్టా ద్వారా తెలియచేశారు. ఫైనల్ షెడ్యూల్ కోసం గోవా వెళ్తున్నట్టు పోస్ట్ లో పేర్కొన్నాడు.
పాయల్ రాజ్ పుత్ మనసులో మాట
సెన్సేషనల్ హిట్ "RX 100" మూవీతో పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో పాయల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోయిన్ గా మారారు. "వెంకీ మామ ", "డిస్కో రాజా " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "ఏంజెల్ " మూవీ తో పాయల్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. పాయల్ ప్రస్తుతం "నరేంద్ర ", " 5 డబ్ల్యూస్ "మూవీస్ లో నటిస్తున్నారు.
బిగ్ బాస్ 4 - బిగ్ బాస్ కే వార్నింగ్ ఇచ్చిన అరియానా
బిగ్ బాస్ 4 - 'రేస్ టు ఫినాలే' టాస్క్ మొదటి లెవెల్ అయిపోగా రెండో లెవల్ కి అభిజిత్, హారిక, సోహెల్ ఇంకా అఖిల్ మిగిలారు. మరి వారికోసం బిగ్ బాస్ రెండో లెవెల్ లో ఏం గేమ్ ప్లాన్ చేసాడు.. ఎవరు మూడో లెవెల్ కి వెళ్లారు అన్నది తెలియాలంటే నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూడాల్సిందే.
"కరోనా వైరస్ " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ , బాలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద చిత్రాలను తెరకెక్కించి వివాదాస్పద దర్శకుడిగా మారారు. రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా పలు మూవీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ లాక్ డౌన్ సందర్భంగా షూటింగ్స్ నిలిచిపోయినా , కరోనా టైమ్ లో తగిన జాగ్రత్తలతో పలు మూవీస్ ను తెరకెక్కించిన ఘనత వర్మదే.
లిక్విడ్ డైట్ లో పవన్ కళ్యాణ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు , బోనీ కపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ "పింక్ "తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో అంజలి , నివేద థామస్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
హారర్ మూవీ లో కాజల్ అగర్వాల్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు ", "ఇండియన్ 2 ", "హే సినామికా " (తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. మాల్దీవుల్లో హనీ మూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేసిన కాజల్ ఇప్పుడు మూవీస్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకూ లవ్ , రొమాంటిక్ , సెంటిమెంట్ పాత్రలలో నటించిన కాజల్ ఫస్ట్ టైమ్ ఒక హారర్ తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బిగ్ బాస్ 4 - 'రేస్ టు ఫినాలే' స్టార్ట్
బిగ్ బాస్ 4 - నిన్న హాట్ హాట్ గా నామినేషన్ ప్రక్రియ జరగగా ఈ రోజు ఫినాలే టాస్క్ పెట్టేసాడు బిగ్ బాస్. మరి ఈ రోజు ఈ టాస్క్ లో ఏం జరిగింది.. ఏమేం సంఘటనలు చోటుచేసుకున్నాయి లాంటి విషయాలు తెలియాలంటే మాత్రం ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
'ఆకాశం నీ హద్దురా' పై సమంత ప్రశంసలు - ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్
సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా ‘సూరరై పోట్రు’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటివరకు డైరెక్ట్ గా విడుదలైన ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో హిట్టవ్వలేదు. సూర్య మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమాపై సెలబ్రిటీస్ పై కూడా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సమంత కూడా ఆ జాబితాలో చేరిపోయింది.
ఇండస్ట్రీ హిట్ "ప్రేమించుకుందాం రా !"
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వెంకటేష్ , అంజలా జవేరి జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్"ప్రేమించుకుందాం రా !" (1997 ) మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సూపర్ హిట్ మూవీ తో జయంత్ దర్శకుడిగా , అంజలా జవేరి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఈ మూవీ కి మణిశర్మ , మహేష్ మహదేవన్ సంగీతం అందించారు. సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

సెట్స్ లో నేను, పవన్ పట్టించుకోము
పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించడం తనకు నచ్చలేదని ప్రకాశ్‌రాజ్ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చిలికి చిలికి వాన అయినట్టు ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు ఇంకాస్త ముదిరింది. అయితే ప్రకాష్ రాజ్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ విషయంపై మాట్లాడిన ప్రకాష్ రాజ్ సెట్స్ లో అలాంటివి పట్టించుకోమని క్లారిటీ ఇచ్చారు. నటులుగా మేము కలిసి పని చేసాం.. అంతేకాదు ఒకరి మీద ఒకరి గౌరవం ఉంది అని తెలిపాడు. అయినా పవన్ కు నేను తన ఐడియాలజీని విమర్శించానని.. పర్సనల్ గా తనని విమర్శించలేదని తెలుసు అని అన్నారు…
కాజల్-గౌతమ్ కిచ్లూ.. వన్‌మంత్ యానివర్సిరీ
కాజల్ అగర్వాల్ పెళ్లి అక్టోబర్ 30న జరిగిన సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లూతో వివాహం జరిగింది. ముంబయిలోని ఓ హోటల్లో ఇరు కుటుంబసభ్యులు అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక విహహం తర్వాత కాజల్ తన ఫొటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది.ఇప్పుడు ప్రస్తుతం హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తుంది ఈ జంట. అక్కడికి వెళ్లిన దగ్గర నుండి రోజుకో ఫొటో అయినా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది ఈ భామ.
మహేష్ ను ఆట పట్టిస్తున్న సితార
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ.. అల్లరి పిడుగు సితార గురించి ప్రేత్యేకంగా చెప్పేదేముంది. చిన్నప్పటి నుండి సితార స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గానే నిలిచింది. మహేష్, నమ్రత సోషల్ మీడియా లో యాక్టీవ్ అన్న సంగతి తెలిసిందే. తమకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను తరుచూ పోస్ట్ చేస్తుంటారు. అంతే కాదు మహేష్, నమ్రత లాగ సితార కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గానే ఉంటుంది. అప్పుడప్పుడు మహేష్, నమ్రత, అన్నయ గౌతమ్ గురించి ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది.
"విరాటపర్వం "సెట్స్ లో రానా దగ్గుబాటి
సురేష్ ప్రొడక్షన్స్ , లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ "మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా 1990 ల నాటి నక్సల్ మూవ్ మెంట్ నేపథ్యంలో వాస్తవ సంఘటనలతో "విరాట పర్వం " మూవీ రూపొందుతుంది. ప్రియమణి , నందితాదాస్ , జరీనావహాబ్ , ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. "విరాట పర్వం " మూవీ 90 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది.
కె.జి.యఫ్ నిర్మాత మరో భారీ ప్లాన్
కె.జి.యఫ్ చాప్టర్ 1’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఇదే సీక్వెల్ లో ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ సినిమా కూడా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాపై కూడా ఎలాంటి అంచనాలున్నాయో తెలుసు. అందరి అంచనాలను మించేలా సినిమాను కూడా అలాగే రూపొందిస్తున్నారు. కరోనా వల్ల షూట్ కు కొన్ని నెలలుగా బ్రేక్ పడగా గత నెలలోనే మళ్లీ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. దాదాపు చివరిదశకు చేరుకుంది.
శృతి హాసన్ ఫొటో షూట్స్
తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ శృతి అభిమానులను అలరిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఎస్ పి జననాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న "లాభం "తమిళ మూవీ లో శృతి కథానాయికగా నటిస్తున్నారు.
విజయ్ దేవరకొండ పై అనన్య పాండే ప్రశంసలు
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు , హిందీ భాషలలో యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. "ఫైటర్ " మూవీ లోని తన పాత్రకై విజయ్ థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ముంబై లో ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న "ఫైటర్ " మూవీ షూటింగ్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది.
మళ్లీ ప్రభాస్ తో సినిమానా - ఇక చాలు
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమాలు అవి. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని బద్దలు కొట్టేసింది.
టాలీవుడ్ లో రీతూ వర్మ బిజీ
సూపర్ హిట్ "బాద్ షా " మూవీ తో కెరీర్ ప్రారంభించిన హైదరాబాద్ అమ్మాయి రీతూ వర్మ "ప్రేమ ఇష్క్ కాదల్ ", "నా రాకుమారుడు ", "ఎవడే సుబ్రమణ్యం " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన సూపర్ హిట్ "పెళ్ళిచూపులు " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రీతూ వర్మ బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. తమిళ మూవీస్ లో కూడా నటించిన రీతూ వర్మ టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంటున్నారు.