టి – సిరీస్ ఫిల్మ్స్ , రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మైథలాజికల్ మూవీ 3D ఫార్మాట్ లో తెలుగు , హిందీ భాషలలో రూపొందనున్న “ఆదిపురుష్ “మూవీ షూటింగ్ జనవరి లో ప్రారంభం కానుంది. 2022 సంవత్సరంలో ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేశారు. సీతగా కృతిసనన్ , లంకాధిపతిగా సైఫ్ అలీఖాన్ ఎంపిక అయ్యారు. బడ్జెట్ కు వెరవకుండా “ఆదిపురుష్ “మూవీని హాలీవుడ్ రేంజ్ లో దర్శకుడు తెరకెక్కించనున్నారు. హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్ పర్ట్స్ ఈ మూవీ కి పని చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రామాయణ కథ” ప్రజలందరికీ తెలిసిందే. రావణుడుగా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. “ఆదిపురుష్” మూవీ లో రామ , రావణ యుద్ధం ను ఒక కొత్త కోణంలో దర్శకుడు ఆవిష్కరించనున్నారనీ, రావణ క్యారెక్టర్ హ్యూమన్ టచ్ తో ఉంటుందనీ చెప్పారు. “ఆదిపురుష్” మూవీ భారతీయ భాషలతో పాటు పలు ఫారిన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుంది. విజువల్ వండర్ గా తెరకెక్కనున్న “ఆదిపురుష్” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం “రాధేశ్యామ్ “మూవీలో నటిస్తున్న ప్రభాస్ ఈ మూవీ తో పాటు నాగ్ అశ్విన్ మూవీ , ప్రశాంత్ నీల్ మూవీ “సలార్” కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: