అద్భుతమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అనసూయ సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్నారు. సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని అనసూయ నటిస్తున్న విషయం తెలిసిందే. “క్షణం “, “రంగస్థలం “, “యాత్ర “, “కథనం “వంటి మూవీస్ తో అనసూయ ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “రంగస్థలం “మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
అనసూయ ప్రస్తుతం “పుష్ప “, “రంగమార్తాండ “, “ఆచార్య “, “ఖిలాడి “, “థ్యాంక్యూ బ్రదర్ “మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. నటిగా బిజీగా ఉన్న టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ఇప్పుడు ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న తమిళ మూవీ లో ఒక కీలక పాత్రకు అనసూయ ఎంపిక అయ్యారు. తాను తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్న విషయాన్ని సిల్క్ స్మిత లుక్ లో ఉన్న తన ఫోటోను అనసూయ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అనసూయ లుక్ అభిమానులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: