ఎప్పుడూ చూడని ప్రభాస్ ను చూస్తారు

You will see prabhas in a brand new avatar says director prashanth neel

మొత్తానికి ప్రభాస్ మంచి జోరు మీద ఉన్నాడుగా. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అది కూడా చిన్నా చితకా సినిమాలు కాదు పాన్ ఇండియా లెవల్ సినిమాలే. దర్శక నిర్మాతలు కూడా ప్రభాస్ తో ఆ రేంజ్ సినిమాలు తీయడానికే ఇష్టపడుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్‌’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. ఇక ఇది సెట్స్‌లో ఉండగానే ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమాకి, ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‌’ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా మరో సినిమాను ప్రకటించాడు ప్రభాస్. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి ‘సలార్‌’ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించి, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కేజీఎఫ్‌’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఇక ఈ సందర్భంగా ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్‌లో ‘కేజీఎఫ్‌’, ‘కేజీఎఫ్‌ 2’ చిత్రాల తర్వాత నిర్మించనున్న మూడో ప్యాన్‌ ఇండియా చిత్రమిది. భారతదేశంలోని అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తాం. వచ్చే ఏడాది జనవరిలో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. ప్రస్తుతం ప్రభాస్‌ చేస్తున్న ‘రాధేశ్యామ్‌’ తర్వాత ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.

ఇక ప్రశాంత్ నీల్ ఈ సినిమా గురించి చెపుతూ.. మరోసారి విజయ్ కిరగందూర్ తో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని.. అందులోనూ ప్రభాస్ హీరోగా నటించడం గొప్ప విషయం.. ఈ సినిమా గురించి ఎప్పటినుండో చర్చలు జరుగుతున్నాయి.. ఇప్పుడు ఫైనల్ గా కన్ఫామ్ అయింది.. ఇక ఈ సినిమాలో ఇంతకుముందు ఎన్నడూ చూడని ప్రభాస్ ను చూస్తారు.. తప్పకుండా సినిమా లవర్స్ ఈ సినిమాను ఇష్టపడుతారు అని చెప్పాడు.

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా వచ్చిన `కె.జి.ఎఫ్‌- చాప్ట‌ర్ 1` సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు దేశవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కె.జి.ఎఫ్‌- చాప్ట‌ర్ 2 కూడా వస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి చూద్దాం ఇది ఎంత వరకూ వర్క్ అవుట్ అవుతుందో.మరి చాప్టర్ 1 సూపర్ హిట్ అవడంతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చుద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =