‘అమ్మ’ వర్ధంతి – ‘తలైవి’ నుండి స్పెషల్ పిక్స్

Thalaivi Movie Team Shares Exclusive Working Stills,Jayalalitha Death Anniversary,Thalaivi Movie Working Stills,Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Kangana Ranaut Shares Thalaivi stills,Kangana Ranaut New stills,Kangana Pays Tribute to Jayalalitha,Thalaivi Movie Latest News

కంగనా ప్రధాన పాత్రలో ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కరోనా వల్ల షూటింగ్ కు కాస్త బ్రేక్ రాగా రీసెంట్ గానే తిరిగి షూటింగ్ ను ప్రారంభించారు. షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. మరికొద్ది రోజుల్లో షూటింగ్ కూడా పూర్తికానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ రోజు జయలలిత వర్థంతి సందర్భంగా ఈసినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా మా టీమ్‌కు, ఎంతో కష్టపడుతున్న మా లీడర్ విజయ్ సర్‌కు ధన్యవాదాలు. మరో వారం రోజుల్లో ఈ సినిమా పూర్తి కాబోతోంది అని తెలిపారు.

కాగా ఇంకా ఈ సినిమాలో అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. విష్ణు వర్ధన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌తో కలిసి విబ్రీ మోషన్‌ పిక్చర్స్‌, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =