
ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 96


కాజల్... స్పెషల్ డే

రెండు తరాల పాత్రల్లో నందమూరి బాలకృష్ణ?

తన బయోపిక్ పై కంగనా ఇంట్రెస్టింగ్ కామెంట్

2017-2018 టీఎస్ఆర్ నేషనల్ ఫిలిం అవార్డ్స్

దేవిశ్రీ ప్రసాద్... మరోసారి రిపీట్ చేస్తాడా?

లవర్స్ డే తెలుగు మూవీ పబ్లిక్ టాక్

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్

యాత్ర ఫస్ట్ డే కలెక్షన్స్

సూర్య ఎన్.జి.కె టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్

టైటిల్ మారిన నిఖిల్ ముద్ర మూవీ

సైంటిస్ట్ వర్షగా నిత్యా మీనన్

`వెంకీ మామ`... సేమ్ సెంటిమెంట్

నాగార్జునకి జోడీగా పాయల్?

తమిళ్, హిందీలో ఎఫ్2 రీమేక్!

వారం గ్యాప్‌లో నయనతార డబుల్ ధమాకా
కోలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తోంది కేరళకుట్టి నయనతార. ఓ వైపు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూనే... మరో వైపు స్టార్ హీరోలతో జోడీ కట్టి మెప్పిస్తోంది. కేవలం తమిళ చిత్రాలకే పరిమితం కాకుండా... తెలుగు, మలయాళ భాషల్లోనూ నటిస్తూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `సైరా నరసింహా రెడ్డి`లో నటిస్తున్న నయన్... తమిళ్‌లో `ఐరా`, `మిస్టర్ లోకల్`, `కొలైయుదిర్ కాలమ్`, విజయ్ - అట్లీ కాంబినేషన్ మూవీలోనూ... మలయాళంలో `లవ్ యాక్షన్ డ్రామా`లోనూ నటిస్తోంది.

కాజల్... స్పెషల్ డే
కాజల్ అగర్వాల్... ఈ భామ టాలీవుడ్‌కి చందమామ. కేవలం తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లోనూ నటిగా తనదైన ముద్ర వేసింది ఈ పంచదార బొమ్మ. 50కి పైగా సినిమాల్లో నటించి... కుర్రకారు మదిని దోచేసింది. అలాంటి కాజల్‌కి ఈ రోజు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే... సరిగ్గా ఇదే ఫిబ్రవరి 15న కాజల్ కథానాయికగా నటించిన మొదటి సినిమా `లక్ష్మీ కళ్యాణం` (2007) విడుదలైంది. తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ఈ సినిమాతోనే కాజల్ హీరోయిన్‌గా తొలి అడుగులు వేసింది. పల్లెటూరి అమ్మాయి లక్ష్మిగా నటించి... తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత అదే ఏడాదిలో వచ్చిన కృష్ణవంశీ…

రెండు తరాల పాత్రల్లో నందమూరి బాలకృష్ణ?
నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను... ఈ పేర్లు వినగానే ఠక్కున `సింహా`, `లెజెండ్` చిత్రాలే గుర్తుకువస్తాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది. అంతేకాదు... `సింహా`, `లెజెండ్` తరహాలోనే ఇందులోనూ బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం. అలాగే... రెండు తరాల పాత్రల్లో ఈ నందమూరి హీరో కనిపించనున్నాడట.

జెర్సీ మూవీ - అదేంటోగానీ ఉన్న పాటుగా సాంగ్ రిలీజ్
మళ్లీరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని ఓ వైవిధ్యమైన కథ జెర్సీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రంజీ క్రికెటర్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 19వ రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసింది. అదేంటోగానీ ఉన్నపాటుగా అన్న సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

తన బయోపిక్ పై కంగనా ఇంట్రెస్టింగ్ కామెంట్
కంగనా అంటే కాంట్రవర్సీ.. కాంట్రవర్సీ అంటే కంగనా అని మణికర్ణిక సినిమాతో మరోసారి నిరూపించింది బాలీవుడ్ క్వీన్ కంగన. సినిమాలతో పాటు పలు కాంట్రవర్సీలతో ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తుంది ఈ భామ. కానీ ఎన్ని వివాదాలు వచ్చినా.. తన టాలెంట్, ముక్కుసూటి తనంతో ఇంత స్థాయిని సంపాదించుకుందన్న సంగతి కూడా అందరూ ఒప్పుకోవాల్సిన నిజమే. ఇక తాజాగా మణికర్ణిక సినిమాతో మరోసారి తన సత్తా చూపించింది. వివాదాల సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి కంగనాకు.

2017-2018 టీఎస్ఆర్ నేషనల్ ఫిలిం అవార్డ్స్
ప్రముఖ వ్యాపారవేత్త,టి. సుబ్బరామరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఫిలిం అవార్డులు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ‘‘ఉత్తరాది, దక్షణాది అనే తేడా లేకుండా సినీ ప్రముఖుల్ని ఇంత ఘనంగా సత్కరించడం సుబ్బిరామిరెడ్డిగారికే చెల్లుతుంది. ఈక్రమంలో 2017, 2018 సంవత్సరాల్లో విడుదలైన చిత్రాల నుంచి ప్రతిభను చాటిన వాటికి పురస్కారాలను అందజేయనున్నారు టీఎస్ఆర్. కాగా ఈ సారి టీఎస్‌ఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకను ఫిబ్రవరి 17న వైజాగ్‌లో నిర్వహించబోతున్నారు. మరి 2017 - 2018 సంవత్సరాల్లో అవార్డులు ఎవరికి దక్కాయో..ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం..

లవర్స్ డే తెలుగు మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే యూత్ కు మాత్రం ఈ సినిమా బాగానే నచ్చేస్తుంది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుందో? లేదో? చెప్పడం కష్టమే.

దేవిశ్రీ ప్రసాద్... మరోసారి రిపీట్ చేస్తాడా?
టాలీవుడ్‌లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. ఈ సంక్రాంతికి `వినయ విధేయ రామ`, `ఎఫ్ 2` చిత్రాలతో సందడి చేసిన డీఎస్పీకి... `ఎఫ్ 2` రూపంలో మరో ఘనవిజయం తన ఖాతాలో జమ అయింది. కాగా... ఇదే జోష్‌లో ఈ వేసవికి (ఒకే నెలలో) మరో రెండు సినిమాలతో సందడి చేయనున్నాడు. ఆ సినిమాలే `చిత్రలహరి`, `మహర్షి`.

ఈ ఏడాది `ట్రిపుల్ ధమాకా` ఇవ్వనున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్?
`అల్లుడు శీను`తో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమైన యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్... అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. తన మార్క్ స్టెప్పులతో, స్టంట్స్‌తో యూత్‌కి చేరువయ్యాడు. కాగా... ఐదేళ్ళ కెరీర్‌లో కేవలం ఐదు చిత్రాలకే పరిమితమైన సాయిశ్రీనివాస్... ఈ ఏడాది మాత్రం కెరీర్ పరంగా జోష్ పెంచనున్నాడు. అన్నీ కుదిరితే... ఈ సంవత్సరం ఏకంగా మూడు సినిమాలతో ఈ యంగ్ హీరో అభిమానులను పలకరించే అవకాశముంది.

లవర్స్ డే తెలుగు మూవీ పబ్లిక్ టాక్
The years of efforts by @KannadaGrahaka to make dubbing mainstream in Kannada finally paying off. [RESPONSE]: Live updates of Oru Adaar Love (OAL) movie…

`పోకిరి` తరహాలో `ఇస్మార్ట్ శంకర్`లోనూ...
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలంటే... `సమ్‌థింగ్ స్పెషల్`గా అనిపించే హీరో క్యారెక్టరైజేషన్స్‌కు మాత్రమే కాదు `ప్రత్యేకం`గా సాగే గీతాలకు కూడా చోటు ఉంటుంది. ఇక పూరి కెరీర్ బెస్ట్ హిట్ `పోకిరి`లోని ప్రత్యేక గీతం `ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే` ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పాటకి మణిశర్మ అందించిన బాణీ, ముమైత్ ఖాన్ నృత్యాలు ప్రధాన బలంగా నిలిచాయి. ఆ పాట తరువాత ముమైత్ పలు ఐటమ్ సాంగ్స్‌లో మెరిసి... `స్టార్ ఐటమ్ గాళ్`గా పేరు తెచ్చుకుంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. సినిమాను మార్చిలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు వర్మ. అయితే ఈ లోపు తను ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన ఫొటోలు తమ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

యాత్ర ఫస్ట్ డే కలెక్షన్స్
మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపధ్యంలో యాత్ర సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నిన్న ఫిబ్రవరి 8 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ తమ నేతను మరోసారి గుర్తుకుతెచ్చారంటూ వైఎస్ అభిమానులు యూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా 970 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.

సూర్య ఎన్.జి.కె టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎన్.జి.కె (నంద గోపాలన్ కుమారన్). పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా గత కొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లకి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీగానే అంచనాలు పెరిగాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి14 వ తేదీన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్
దేశ విదేశాలలో మేడమ్ టుస్సాడ్స్ మైనపు ప్రతిమల మ్యూజియం లు కొలువుతీరిన విషయం తెలిసిందే. సినిమా నటులతో పాటు ప్రపంచ ప్రముఖుల మైనపు ప్రతిమలు ఈ మ్యూజియం లలో ఉంటాయి. సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఆ గౌరవంపొందిన అతి తక్కువ మందిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు మైనపు ప్రతిమ సింగపూర్ లో తయారయింది. ఆ ప్రతిమ ఫిబ్రవరి నెలాఖరు లో హైదరాబాద్ కు రానుందని సమాచారం.

టైటిల్ మారిన నిఖిల్ ముద్ర మూవీ
హీరో నిఖిల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా TN సంతోష్ దర్శకత్వంలో జర్నలిజం బ్యాక్ డ్రాప్ లో నిజ సంఘటనలు, నిజాలు నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ నిఖిల్ ముద్ర మూవీ రూపొందుతుంది. కనితన్ తమిళ మూవీ తెలుగు రీమేక్ ఈ నిఖిల్ మూవీ. మూవీ డైనమిక్స్, ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ మూవీ లో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు. బి. మధు సమర్పణలో రాజ్ కుమార్ ఆకెళ్ళ, కావియ వేణు గోపాల్ నిర్మాతలు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.

సైంటిస్ట్ వర్షగా నిత్యా మీనన్
దక్షిణాదిలోని అన్ని పరిశ్రమల్లోనూ నటిగా తన ప్రతిభను చాటుకుంది కేరళ కుట్టి నిత్యా మీనన్. అలాగే... పలు పురస్కారాలను తన సొంతం చేసుకుంది. త్వరలో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. అక్షయ్ కుమార్, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హారితో కలసి నిత్య నటిస్తున్న ఆ చిత్రమే `మిషన్ మంగళ్`.

`వెంకీ మామ`... సేమ్ సెంటిమెంట్
నిజజీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య... తెరపైనా అవే పాత్రలతో `వెంకీ మామ` చిత్రాన్ని చేయనున్న సంగతి తెలిసిందే. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో వెంకీకి జోడీగా శ్రియ, నాగచైతన్యకి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారు. ఈ నెల 21 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాని విజయదశమి కానుకగా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే... ఇదివరకు నాగచైతన్య కథానాయకుడిగా నటించిన `ప్రేమమ్` చిత్రంలోనూ వెంకీ మేనమామ పాత్రలో అతిథిగా కనిపించిన సంగతి…

నాగార్జునకి జోడీగా పాయల్?
గత ఏడాది సంచలనం `ఆర్ ఎక్స్ 100`తో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాలోనే నటనకు అవకాశమున్న పాత్రలో కనిపించి మెప్పించిన ఈ ఉత్తరాది సోయగం... ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజకి జోడీగా `డిస్కో రాజా`లో నటిస్తోంది. అంతేకాదు... మరో క్రేజీ ప్రాజెక్ట్‌లోనూ కథానాయికగా నటించే అవకాశం పాయల్‌కు దక్కిందని టాలీవుడ్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే... 2002లో ఘనవిజయం సాధించిన కింగ్ నాగార్జున `మన్మథుడు` చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. `చి ల సౌ` ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా మార్చి నుంచి…

తమిళ్, హిందీలో ఎఫ్2 రీమేక్!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన మల్టీస్టారర్ ఎఫ్2 సినిమా ఎంత ఘన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచి కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. వంద కోట్ల మైలు రాయిని అందుకుని దిల్‌రాజు చిత్రాల్లో నెంబర్ వన్‌గా నిలిచింది.