ఈ ఏడాది `ట్రిపుల్ ధ‌మాకా` ఇవ్వ‌నున్న బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌?

Bellamkonda Sreenivas Movies In 2019, Bellamkonda Sreenivas New Movie News, Bellamkonda Sreenivas Next Film Updates, Bellamkonda Sreenivas Next Film’s In This Year, Bellamkonda Sreenivas To Release 3 Movies This Year, Bellamkonda Sreenivas Upcoming Movie News, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywoodd Cinema Updates
Bellamkonda Sreenivas To Release 3 Movies This Year

`అల్లుడు శీను`తో తెలుగు తెర‌కు క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మైన యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌… అన‌తి కాలంలోనే త‌నకంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. త‌న మార్క్ స్టెప్పుల‌తో, స్టంట్స్‌తో యూత్‌కి చేరువ‌య్యాడు. కాగా… ఐదేళ్ళ కెరీర్‌లో కేవ‌లం ఐదు చిత్రాల‌కే ప‌రిమిత‌మైన సాయిశ్రీ‌నివాస్‌… ఈ ఏడాది మాత్రం కెరీర్ ప‌రంగా జోష్ పెంచనున్నాడు. అన్నీ కుదిరితే… ఈ సంవ‌త్స‌రం ఏకంగా మూడు సినిమాల‌తో ఈ యంగ్ హీరో అభిమానుల‌ను ప‌ల‌క‌రించే అవ‌కాశ‌ముంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… తేజ ద‌ర్శ‌క‌త్వంలో `సీత‌` అనే సినిమాతో బిజీగా ఉన్న సాయిశ్రీ‌నివాస్‌… ఆ సినిమా విడుద‌ల‌య్యేలోపు మ‌రో రెండు చిత్రాల‌ని ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. అందులో ఒక‌టి `రాక్ష‌స‌న్‌` రీమేక్ కాగా… మ‌రొక‌టి `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమా. ఈ రెండు ప్రాజెక్ట్‌ల‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుంది. `సీత‌` వేస‌వి కానుక‌గా రిలీజ్ కానుండ‌గా… మిగిలిన రెండు చిత్రాలు ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెర‌పైకి రానున్నాయి. మ‌రి… ఈ మూడు చిత్రాల‌తో సాయిశ్రీ‌నివాస్ మంచి విజ‌యాలు అందుకుంటాడేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=08Fg-1DCHVs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + nineteen =