నిజజీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య… తెరపైనా అవే పాత్రలతో `వెంకీ మామ` చిత్రాన్ని చేయనున్న సంగతి తెలిసిందే. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో వెంకీకి జోడీగా శ్రియ, నాగచైతన్యకి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారు. ఈ నెల 21 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాని విజయదశమి కానుకగా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఇదివరకు నాగచైతన్య కథానాయకుడిగా నటించిన `ప్రేమమ్` చిత్రంలోనూ వెంకీ మేనమామ పాత్రలో అతిథిగా కనిపించిన సంగతి తెలిసిందే. సదరు ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కూడా 2016లో దసరా కానుకగానే రిలీజై విజయం సాధించింది. మరి… అదే సీజన్‌లో మరోసారి మేనమామ, మేనల్లుళ్ళుగా పూర్తి స్థాయిలో అలరించడానికి సిద్ధమవుతున్న వెంకీ, చైతూ… `ప్రేమమ్` తరహాలో మరో విజయాన్ని సొంతం చేసుకుంటారేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=YGvYS-pTa3Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)