అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన మల్టీస్టారర్ ఎఫ్2 సినిమా ఎంత ఘన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచి కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. వంద కోట్ల మైలు రాయిని అందుకుని దిల్‌రాజు చిత్రాల్లో నెంబర్ వన్‌గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి ఇంత హిట్టయిన సినిమాను రీమేక్ చేయకుండా ఉంటారా? ఇప్పుడు ఈ సినిమాను కూడా హిందీ, తమిళ్ భాషల్లో రీమేక్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు దీనిపై మాట్లాడుతూ… ఈ సినిమాను బాలీవుడ్ లో పలువురు హీరోలు చూస్తూనే ఉన్నారు… ఈ సినిమా రైట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి కాబట్టి వీలుంటే హిందీలో చిత్రాన్ని నేనే నిర్మించాలని చూస్తున్నా… కానీ ఈ ఏడాది తెలుగులో చాలా సినిమాలు క్యూలో ఉన్నాయి కాబట్టి సొంతంగా నిర్మించడం కంటే… నిర్మాణ భాగస్వామిగా ఉండటమే మంచిదని భావిస్తున్నా అని చెప్పారు. అన్నీ ఓకే అయిన తరువాత సినిమా క్యాస్టింగ్ వివరాలు చెపుతామన్నారు. మరి చూద్దాం అక్కడ ఏ హీరోలు చేస్తారో..?
[youtube_video videoid=TwwK90G6d5g]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: