దక్షిణాదిలోని అన్ని పరిశ్రమల్లోనూ నటిగా తన ప్రతిభను చాటుకుంది కేరళ కుట్టి నిత్యా మీనన్. అలాగే… పలు పురస్కారాలను తన సొంతం చేసుకుంది. త్వరలో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. అక్షయ్ కుమార్, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హారితో కలసి నిత్య నటిస్తున్న ఆ చిత్రమే `మిషన్ మంగళ్`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మార్స్ మిషన్ విజయవంతం కావడానికి కృషి చేసిన మహిళా శాస్త్రవేత్తల చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిత్య సైంటిస్ట్ వర్షా పిళ్ళై పాత్రలో కనిపించనుంది. జగన్ శక్తి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ బయోగ్రాఫికల్ డ్రామా ఆగస్టు 15న తెరపైకి రానుంది. కాగా… ఆదివారంతో నిత్య తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో టీమ్ తో తన అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ… ఓ ఫొటోని కూడా షేర్ చేసింది నిత్య. మరి… మొదటి హిందీ సినిమాతో నిత్య బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=xsTZWd1V_8M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: