రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. సినిమాను మార్చిలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు వర్మ. అయితే ఈ లోపు తను ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన ఫొటోలు తమ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ట్రైలర్ ను చూస్తుంటే మొత్తానికి రామ్ గోపాల్ వర్మ పెద్ద రచ్చకే తెరతీసినట్టు కనిపిస్తోంది. వెన్నుపోటు అనే పాటతో సంచలనం సృష్టించి ఇప్పుడు అదే వెన్నుపోటు ఎపిసోడ్ ను చూపించినట్టు ట్రైలర్ ను చూస్తుంటే అర్ధమైపోతుంది.
”రామ రామ రామ” అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మొదలైన ట్రైలర్ లో.. ‘జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుందో.. ఎవరికీ అర్ధం కాదు..’ అంటూ…”ఈవిడ పేరు లక్ష్మీ పార్వతి నా జీవిత చరిత్ర రాస్తున్నారు..” అంటూ లక్ష్మీపార్వతిని తన పార్టీ సభ్యులకు పరిచయం చేసే సన్నివేశాలను చూపించారు. వాటితో పాటు ”దానికిగాని కొడుకు పుడితే మీ ఫ్యామిలీ ఫినిష్” అంటూ చంద్రబాబు.. ఎన్టీఆర్ ఫ్యామిలీతో అనడం.. ”ఈ వయసులో కూడా మీకు ఆడతోడు అవసరమంటే..” అంటూ హరికృష్ణ.. ఎన్టీఆర్ ని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే దానికి ఎన్టీఆర్ సీరియస్ అవ్వడం చూపించారు. ”తమ్ముళ్లూ వాడి మాట వినకండి..” అంటూ ఎన్టీఆర్.. చంద్రబాబుని ఉద్దేశిస్తూ పార్టీ సభ్యులకు చెబితే వారు మాత్రం ఎన్టీఆర్ పై చెప్పులు విసరడం… చివరగా ఎన్టీఆర్.. ”నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు.. వాడిని నేను నమ్మడం” అంటూ చంద్రబాబుని ఉద్దేశించి చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా నిలిచింది. మరి ఈ ట్రైలర్ చూసిన తెలుగు తమ్ముళ్లు ఊరుకుంటారా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అంత క్లియర్ కట్ వెన్నుపోటును వర్మ చూపించిన తరువాత తెలుగు తమ్ముళ్లు పెద్ద గొడవకే దిగుతారనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో…!
కాగా ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తుండగా.. కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రలో వంగవీటి ఫేం శ్రీతేజ్ కనిపించనున్నాడు. ఇక ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ నటిస్తున్నాడు. మరి వర్మ లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎంటర్ అయిన తరువాత నుండి తెరకెక్కిస్తున్నాడు కాబట్టి ఈ సినిమాపై అంచనాలు ఉండటం కామనే. మరి తన ట్విట్టర్ లో రోజుకో ట్విస్ట్.. రోజుకో ట్వీట్ తో క్యూరియాసిటీని పెంచుతున్న వర్మ… ఈ సినిమాలో ఏం చూపిస్తాడో? ఆ అంచనాలను రీచ్ అవుతాడో? లేదో? చూద్దాం..
[youtube_video videoid=WbtiDxR1DZY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: