నాగార్జున‌కి జోడీగా పాయ‌ల్‌?

Payal Rajput To Act With Nagarjuna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Latest Tollywood Cinema Upddates,Payal Rajput Latest News,Actress Payal Rajput New Movie Updates,Heroine Payal Rajput Next Film News,Payal Rajput Upcoming Movie News,Payal Rajput to pair up with Nagarjuna,Payal Rajput to Play the Female Lead in Nagarjuna Upcoming Film
Payal Rajput To Act With Nagarjuna

గ‌త ఏడాది సంచ‌ల‌నం `ఆర్ ఎక్స్ 100`తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్‌. మొద‌టి సినిమాలోనే న‌ట‌న‌కు అవ‌కాశ‌మున్న పాత్ర‌లో క‌నిపించి మెప్పించిన ఈ ఉత్త‌రాది సోయ‌గం… ప్ర‌స్తుతం మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌కి జోడీగా `డిస్కో రాజా`లో న‌టిస్తోంది. అంతేకాదు… మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లోనూ క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం పాయ‌ల్‌కు ద‌క్కింద‌ని టాలీవుడ్ టాక్‌. ఆ వివ‌రాల్లోకి వెళితే… 2002లో ఘ‌న‌విజ‌యం సాధించిన కింగ్ నాగార్జున‌ `మ‌న్మ‌థుడు` చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. `చి ల సౌ` ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా మార్చి నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. 60 రోజుల పాటు పోర్చుగ‌ల్‌లో నిర‌వ‌ధికంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనున్న ఈ సినిమాని ఆగ‌స్టులో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉంటే… `మ‌న్మ‌థుడు` త‌ర‌హాలోనే ఈ సీక్వెల్‌లోనూ ఇద్ద‌రు నాయిక‌ల‌కు స్థాన‌ముంద‌ని ఇప్ప‌టికే వార్త‌లు వినిపించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం… మెయిన్ హీరోయిన్‌గా న‌టించే ఛాన్స్ పాయ‌ల్ రాజ్‌పుత్‌కు ద‌క్కింద‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే పాయ‌ల్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=TqaE5Z_-fFc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.