ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 60
రొమాంటిక్ మూవీ లో కీలక పాత్ర
దీపావళికి `అల వైకుంఠపురములో` టీజర్?
బాలీవుడ్ మూవీ రీమేక్‌లో నాగార్జున?
`మహాసముద్రం`లో యంగ్ హీరోస్?
'మేజర్' కోసం కష్టపడుతున్న అడివి శేష్
సాయి పల్లవి అనుకోని అతిధి రిలీజ్ డేట్ ఫిక్స్
'రాజు గారి గది 3' వైరల్ గా #NeckCrackChallenge

'రాజా రాణి' రీమేక్ లో..?
మ్యూజికల్ హిట్ ‘రావోయి చందమామ’కి 20 ఏళ్ళు
ప్రముఖ నిర్మాత చేతికి ‘ఖైదీ’ తెలుగు రైట్స్
చిరంజీవి ‘శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్.’కి 15 ఏళ్ళు
శేఖర్ కమ్ముల ‘ఆనంద్’కు 15 ఏళ్ళు
యన్టీఆర్ చిత్రంలో 'ఛలో' బ్యూటీ?
వేసవిలో అఖిల్ సందడి?
యంగ్ చిరంజీవి పాత్రలో మెగా పవర్ స్టార్..?
ఫ్యాన్స్ కు పండగ - ప్రైమ్ లో విజయ్ 'పోలీసోడు'
నేను 'రూలర్' అంటున్న బాలకృష్ణ
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు డబ్బింగ్ వర్క్ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
రొమాంటిక్ మూవీ లో కీలక పాత్ర
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ ,ఛార్మి ) నిర్మాణసారథ్యం లో అనిల్ పాడూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రొమాంటిక్" మూవీ రూపొందుతున్న తెలిసిందే. మందిరా బేడి, మకరంద్ దేశ్ పాండే , దివ్యదర్శిని ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.
దీపావళికి `అల వైకుంఠపురములో` టీజర్?
`సన్నాఫ్ సత్యమూర్తి` తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `అల వైకుంఠపురములో`. ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా... ఇతర ముఖ్య పాత్రల్లో టబు, నివేదా పెతురాజ్, సుశాంత్, నవదీప్, సునీల్, జయరామ్ దర్శనమివ్వనున్నారు. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ భారీ బడ్జెట్ మూవీ... 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.
బాలీవుడ్ మూవీ రీమేక్‌లో నాగార్జున?
వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా తనదైన ముద్రవేశారు ‘కింగ్’ నాగార్జున. ప్రస్తుతం `స్టార్ మా` టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్ బాస్3’కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగ్... సదరు రియాల్టీ షో పూర్తవగానే తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. అంతేకాదు... ఓ బాలీవుడ్ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం ఉంటుందని తెలిసింది.
`మహాసముద్రం`లో యంగ్ హీరోస్?
`ఆర్ ఎక్స్ 100` వంటి సంచలన చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు అజయ్ భూపతి. ఆ సినిమా విడుదలై ఏడాది దాటినా... అజయ్ నుంచి మరో మూవీ రాలేదు. ఆమధ్య మాస్ మహారాజా రవితేజతో `మహాసముద్రం` చేయబోతున్నట్లు, అందులో ఓ కీలక పాత్రలో సిద్ధార్థ్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, రవితేజ తప్పుకోవడంతో... ఆ ప్రాజెక్ట్ కాస్త డీలే అయ్యింది.
'మేజర్' కోసం కష్టపడుతున్న అడివి శేష్
విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. కేవలం హీరోగానే కాదు.. మంచి రైటర్ గా కూడా అడివి శేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఇటీవల 'ఎవరు' సినిమాతో కూడా మంచి హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.
సాయి పల్లవి అనుకోని అతిధి రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ బ్యూటీ సాయిపల్లవి మలయాళంలో చేసిన ‘అథిరన్’ సినిమా ఎంత విజయం సాధించిందో తెలుసు. వివేక్ దర్శకత్వంలో సాయి పల్లవి, ఫహాద్ ఫాజిల్, ప్రకాశ్‌రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘అథిరన్’ మూవీ సూపర్‌హిట్ అయింది. ఇక ఫిదా సినిమాతో సాయి పల్లవికి తెలుగులో కూడా మంచి క్రేజ్ రావడంతో 'అథిరన్' సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారు.
'రాజు గారి గది 3' వైరల్ గా #NeckCrackChallenge
ఓంకార్ దర్శకత్వంలో 'రాజు గారి గది' సీక్వెల్ లో భాగంగా 'రాజు గారి గది3' తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నెల 18వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఓంకార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ‘రాజు గారి గది 3’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ‘యూ/ఏ’ సర్టిఫికెట్ ను సొంతం చేసుకొని రిలీజ్ కు సిద్ధం గా ఉంది.
నటుడు ఉత్తేజ్ నిర్వహిస్తున్న మయూఖా టాకీస్ సర్టిఫికేట్స్ ప్రధానోత్సవం
ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ నిర్వహిస్తున్న “మయూఖా టాకీస్ " యాక్టింగ్ స్కూల్ సర్టిఫికెట్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఈరోజు ( అక్టోబర్ 15) ఫిలిం ఛాంబర్లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాలులో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకులు తేజ, సురేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, యువ నిర్మాత రాహుల్ యాదవ్, దర్శకనిర్మాత లక్ష్మీకాంత్, మయూఖా టాకీస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకుడు ఉత్తేజ్, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నట శిక్షణ పూర్తి చేసుకున్న రెండు బ్యాచ్ ల యాక్టింగ్ స్టూడెంట్స్ కు దర్శకులు తేజ, సురేందర్ రెడ్డి సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు. ఈ…

'రాజా రాణి' రీమేక్ లో..?
అట్లీ దర్శకత్వంలో ఆర్యన్, నయనతార, జై, నజ్రియా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'రాజా రాణి' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. తమిళ్ లోనే కాదు... తెలుగులో కూడా ఈ సినిమా మంచి హిట్ అయింది. ఎప్పుడు చూసినా కూడా ఈ సినిమా అంతే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటారా..?
చాలా ఏళ్ళ తర్వాత భార్యను డైరెక్ట్ చేయనున్న కృష్ణవంశీ.. !
తెలుగు సినీ పరిశ్రమలోక్రియేటివ్ డైరెక్టర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు కృష్ణవంశీ. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు. అయితే అప్పటి డైరెక్టర్స్ కు ఓ రకంగా చెప్పాలంటే కాలం కలిసిరావట్లేదు అని చెప్పొచ్చు. కస్టపడి ఏదోరకంగా సినిమాలు తీసినా ఫ్లాప్స్ పలకరిస్తున్నాయి తప్పా.. హిట్ మాత్రం దక్కట్లేదు. అలానే ఎన్నో హిట్స్ అందించిన కృష్ణవంశీకి కూడా పరిస్థితులు బాగోలేక ఈ మధ్య పరాజయాలే పలకరించాయి. అందుకే ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు ఎప్పటినుండో.
మ్యూజికల్ హిట్ ‘రావోయి చందమామ’కి 20 ఏళ్ళు
‘కింగ్’ నాగార్జున కెరీర్‌లో పలు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘రావోయి చందమామ’ ఒకటి. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ అండ్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌ను... వైజయంతి మూవీస్ పతాకంపై అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మించారు. నాగ్‌కి జోడిగా అంజలా ఝవేరి, కీర్తి రెడ్డి నటించగా... జగపతిబాబు, తనికెళ్ళ భరణి, చంద్రమోహన్, అలీ, వేణుమాధవ్, ఎం.ఎస్.నారాయణ, రంగనాథ్, సుధ, ‘షావుకారు’ జానకి, ఝాన్సీ, బేబీ నిహారిక ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ ప్రత్యేక గీతంలో కనువిందు చేసింది.
ప్రముఖ నిర్మాత చేతికి ‘ఖైదీ’ తెలుగు రైట్స్
'మా నగరం' ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను.. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇక టీజర్, ట్రైలర్ తో ఈసినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నారు. ఇక అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ లేదు. పాటలు కూడా లేనట్టు తెలుస్తుంది. అంతే కాదు 62 రోజుల పాటు నిర్విరామంగా రాత్రుళ్ళు షూటింగ్ జరిపిన ఏకైక చిత్రం ఇదే.
చిరంజీవి ‘శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్.’కి 15 ఏళ్ళు
“రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం” అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్.’ మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో... బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే కథానాయికగా నటించింది. పరేష్ రవాల్, శ్రీకాంత్, శర్వానంద్, గిరీష్ కర్నాడ్, సూర్య, వేణుమాధవ్, అలీ, ఎం.ఎస్.నారాయణ, భూపేంద్ర సింగ్, చలపతిరావు, ‘ఆహుతి’ ప్రసాద్, వెన్నిరాడై నిర్మల ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథి పాత్రలో తళుక్కున మెరవగా... అంజలా ఝవేరి ప్రత్యేక గీతంలో నర్తించింది. బాలీవుడ్ మూవీ ‘మున్నా భాయి ఎం.బి.బి.ఎస్.’కి రీమేక్‌గా ‘శంకర్ దాదా…
శేఖర్ కమ్ముల ‘ఆనంద్’కు 15 ఏళ్ళు
ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ముఖ్యంగా... శేఖర్ కెరీర్ ఆరంభంలో “మంచి కాఫీ లాంటి సినిమా” అంటూ వచ్చిన 'ఆనంద్' ... తదనంతర కాలంలో క్లాసిక్ మూవీగా నిలచింది. ఆనంద్ గా రాజా, రూప గా కమలినీ ముఖర్జీ గుర్తుండిపోయే పాత్రల్లో నటించగా... సత్యా కృష్ణన్, అనీష్ కురువిల్ల, అనుజ్ గుర్వారా, మెల్కోటే, బేబీ భకిత ఫ్రాన్సిస్ ఇతర ముఖ్య భూమికలు పోషించారు.
యన్టీఆర్ చిత్రంలో 'ఛలో' బ్యూటీ?
యంగ్ టైగర్ యన్టీఆర్... ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెరుపువేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ పేట్రియాటిక్ డ్రామా... 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే... మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తారక్. ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ డ్యాన్స్ బేస్డ్ మూవీ చేయనున్నాడు తారక్. ‘ఆర్ ఆర్ ఆర్’ పూర్తైన వెంటనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
చిరు కోసం దేవాదాయశాఖను టచ్ చేయనున్న కొరటాల?
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో చిరు దేవాదాయశాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపించనున్నట్టు సమాచారం. అంతేకాదు... ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్తొకటి ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
వేసవిలో అఖిల్ సందడి?
'సిసింద్రీ'(1995)గా బుడిబుడి అడుగుల ప్రాయంలోనే ఘన విజయాన్ని అందుకున్న వైనం అక్కినేని అఖిల్ సొంతం. ఆ సినిమా విడుదలైన 20 ఏళ్ల తర్వాత 'అఖిల్'(2015)తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. ఆపై 'హలో', 'మిస్టర్ మజ్ను' చిత్రాలలో సందడి చేసిన అఖిల్... ఇప్పటివరకు 'సిసింద్రీ' స్థాయి విజయాన్ని నమోదు చేసుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో... 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పైనే తన ఆశలను పెట్టుకున్నాడు.
యంగ్ చిరంజీవి పాత్రలో మెగా పవర్ స్టార్..?
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిన సైరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటివరకూ ఈ సినిమా దాదాపు 230 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత చిరు కొరటాల దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
ఫ్యాన్స్ కు పండగ - ప్రైమ్ లో విజయ్ 'పోలీసోడు'
తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా విజయ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. అందుకే తాను తీసిన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ అయ్యేలా చూసుకుంటాడు. ఇక విజయ్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇక ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘బిగిల్' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'విజిల్' అనే పేరుతో రానుంది. ఈ సినిమా కోసం కూడా ఎప్పటిలాగే అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.