‘రాజు గారి గది 3’ వైరల్ గా #NeckCrackChallenge

Raju Gari Gadhi 3 Neck Crack Challenge Goes Viral,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Raju Gari Gadhi 3 Neck Crack Challenge,Raju Gari Gadhi 3 Challenge,Raju Gari Gadhi 3 Neck Challenge

ఓంకార్ దర్శకత్వంలో ‘రాజు గారి గది’ సీక్వెల్ లో భాగంగా ‘రాజు గారి గది3’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నెల 18వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఓంకార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ‘రాజు గారి గది 3’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ‘యూ/ఏ’ సర్టిఫికెట్ ను సొంతం చేసుకొని రిలీజ్ కు సిద్ధం గా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక సీన్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ మూవీ ట్రైలర్ లో అశ్విన్ తన తలను తిప్పే సన్నివేశం ఒకటి గుర్తుండే ఉంటుంది కదా. అదే సీన్ ఇప్పుడు టిక్ టాక్ లో వైరల్ గా మారింది. అందరూ ఆ సీన్ ను టిక్ టాక్ వీడియోలు చేస్తుండటంతో ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ గా మారాయి.
 

కాగా ఇంకా ఈ సినిమాలో అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ, ఊర్వశి, అజయ్ ఘోష్ తదితరులు నటించారు. మరి ‘రాజు గారి గది’ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ‘రాజు గారి గది2’ మాత్రం కాస్త నిరాశ పరిచింది. మరి ఈ సీక్వెల్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం మూడు రోజులు ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.