చాలా ఏళ్ళ తర్వాత భార్యను డైరెక్ట్ చేయనున్న కృష్ణవంశీ.. !

Krishna Vamsi To Direct Ramya Krishna After Many Years,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Director Krishna Vamsi To Direct Ramya Krishna,Krishna Vamsi Upcoming Projects,Ramya Krishna Latest News 2019

తెలుగు సినీ పరిశ్రమలోక్రియేటివ్ డైరెక్టర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు కృష్ణవంశీ. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు. అయితే అప్పటి డైరెక్టర్స్ కు ఓ రకంగా చెప్పాలంటే కాలం కలిసిరావట్లేదు అని చెప్పొచ్చు. కస్టపడి ఏదోరకంగా సినిమాలు తీసినా ఫ్లాప్స్ పలకరిస్తున్నాయి తప్పా.. హిట్ మాత్రం దక్కట్లేదు. అలానే ఎన్నో హిట్స్ అందించిన కృష్ణవంశీకి కూడా పరిస్థితులు బాగోలేక ఈ మధ్య పరాజయాలే పలకరించాయి. అందుకే ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు ఎప్పటినుండో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఫైనల్ గా మరో కొత్త ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. తన కొత్త ప్రాజెక్ట్ లో తన భార్య రమ్యకృష్ణ ను డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అప్పుడెప్పుడో 1998 లో వచ్చిన ‘చంద్రలేఖ’ సినిమాను కృష్ణవంశీ డైరెక్ట్ చేయగా… ఆ తర్వాత నితిన్ సినిమా ‘శ్రీ ఆంజనేయ’ సినిమాలో నటించింది. ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకు తన వైఫ్ రమ్యకృష్ణను డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో కృష్ణవంశీ సన్నిహితుడైన ప్రకాష్ రాజ్ ఇంకా అవికా గోర్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాపై మరింత సమాచారం తెలియాలంటే.. దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + nineteen =