కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 61

సినిమా వార్తలు

గోపీచంద్ ట్రాక్ లో పడినట్టేనా..!

విలన్ గా కెరీర్ ను ప్రారంభించి తర్వాత హీరో గా పలు హిట్ సినిమాలు తీసి టాలీవుడ్ యాక్షన్ హీరోగా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు గోపీచంద్. అయితే అప్పటికీ.. ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయి. పాపం గత కొన్నేళ్లుగా మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఈ మధ్య ఒక్క సినిమా కూడా గోపీచంద్ కు హిట్ తెచ్చిపెట్టిన దాఖలాలు లేవు. దసరా పండుగ సందర్భంగా ఎన్నో ఆశలతో రిలీజ్ చేసిన 'చాణక్య' కూడా గోపీచంద్ ఆశలపై నీరు చల్లేసింది. కనీసం 5 కోట్ల షేర్ కూడా తెచ్చుకోలేకపోయింది. అంతేకాదు తమిళ దర్శకులను నమ్ముకొని దెబ్బతిన్నాడన్న వార్తలు కూడా వస్తున్నాయి. చాణక్య ముందు వచ్చిన 'ఆక్సీజన్' సినిమాను కూడా…

TFN Adminవాట్సాప్
Blockbuster Arjun Reddy Combination To Repeat Again,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Arjun Reddy Combination To Repeat,Arjun Reddy Combo to Repeat Once Again,Blockbuster Arjun Reddy Combinat
సినిమా వార్తలు

'అర్జున్ రెడ్డి' కాంబినేషన్ రిపీట్

'అర్జున్ రెడ్డి' ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూత్ కు ఐకాన్ గా నిలిచి ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసాడు. ఈ సినిమా తర్వాత కాస్త తెలుగు సినిమా ఆలోచనా ధోరణి కాస్త మారిందని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత అటు విజయ్ దేవరకొండ.. ఇటు సందీప్ వంగా రేంజ్ కూడా మారిపోయింది. విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. సందీప్ వంగా హిందీలోకి వెళ్ళాడు. అక్కడ కూడా అర్జున్ రెడ్డి రీమేక్ తీసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు తాజాగా మరో హిందీ సినిమాను లైన్ లో పెట్టాడు. 'కబీర్ సింగ్' తీసిన నిర్మాతలతోనే సందీప్ రెడ్డి వంగా కొత్త సినిమా చేయనున్నాడు…

TFN Adminవాట్సాప్
Raju Gari Gadhi Series To Continue Till 10 Parts,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Raju Gari Gadhi Series,Raju Gari Gadhi Movie Series,Raju Gari Gadhi Series Upto 10 Parts
సినిమా వార్తలు

'రాజు గారి గది' 10 భాగాలా..?

యాంకర్ గా బుల్లి తెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్.. ద‌ర్శకుడిగా తెరకెక్కించిన హార‌ర్ కామెడీ 'రాజుగారి గ‌ది'. 2015 లో వచ్చిన ఈ సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓంకార్ తమ్ముడు అశ్విన్ ప్రధాన పాత్రలో ధనరాజ్, షకలక శంకర్, ధన్య కృష్ణ, విద్యుల్లేఖ, పూర్ణ, సప్తగిరి, పోసాని కృష్ణ మురళీ తదితరులు నటించిన ఈ సినిమా మంచి హిట్ అయింది. ఇక ఈ సినిమా హిట్ తో ఓంకార్ సీక్వెల్ ను 'రాజు గారి గది 2' పేరుతో తెరకెక్కించిన సంగతి కూడా విదితమే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి 152 వ మూవీ కి డైలాగ్స్ సహకారం

శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మెగా స్టార్ చిరంజీవి హీరోగా సామజిక సందేశం నేపథ్యంలో చిరంజీవి 152 వ మూవీ రూపొందనుంది. శృతి హాసన్ కథానాయిక, ఇతర ముఖ్య పాత్రలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ హీరో ఆర్య నటించనున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

జెర్సీ మూవీ హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యం లో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జెర్సీ మూవీ హిందీ లో రీమేక్ కానుంది. తెలుగు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ మూవీ లో హీరోగా నటించిన షాహిద్ కపూర్ జెర్సీ హిందీ వెర్షన్ కు హీరోగా ఎంపిక అయ్యారు. కబీర్ సింగ్ మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. షాహిద్ కపూర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

Team TFNవాట్సాప్
సాంగ్

అల ... వైకుంఠపురములో .. బ్రహ్మానందం స్పెషల్ సాంగ్ ?

గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా అల ... వైకుంఠపురములో ..మూవీ శరవేగంగా రూపుదిద్దుకొంటుంది. సీనియర్ హీరోయిన్ టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సూపర్ హిట్ వాల్మీకి మూవీ లో అతిథి పాత్రలో నటించిన స్టార్ కమెడియన్ బ్రహ్మానందం అల ... వైకుంఠపురములో .. మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
Naga Shaurya New Movie Launched,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Naga Shaurya New Movie,Naga Shaurya Upcoming Movie Details,Naga Shaurya Latest News 2019
సినిమా వార్తలు

నాగశౌర్య మరో కొత్త సినిమా ప్రారంభం

మొత్తానికి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నాగశౌర్య. ఒక వైపున ఇతర బ్యానర్లలో సినిమాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లోను నాగశౌర్య సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా అశ్వద్ధామ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. తన సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగ‌శౌర్యకి జంట‌గా మెహ్రీన్ నటిస్తుండగా... పోసాని కృష్ణముర‌ళి, స‌త్య, వి.జ‌య‌ప్రకాష్‌, కిషోర్‌, ఎం.ఎస్‌. భాస్కర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ సంగీతం సమకూరుస్తుండగా... మనోజ్‌రెడ్డి…

TFN Adminవాట్సాప్
ఖైదీ తెలుగు ట్రైలర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

ఖైదీ తెలుగు ట్రైలర్ రిలీజ్

హిట్స్ తో ప్లాప్స్ తో పనిలేకుండా మొదటి నుండి వైవిధ్యమైన సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు కార్తీ. ఇక ఇటీవల ఖాకీ సినిమాతో పర్వాలేదనిపించిన కార్తీ ఆ తరువాత చినబాబు - దేవ్ సినిమాతో డిజాస్టర్స్ అందుకున్నాడు. ఇక టీజర్ తో ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచిన చిత్రయూనిట్...రీసెంట్ గా ఆ సినిమా తెలుగు ట్రైలర్ ని విడుదల చేశారు. తమిళ్ ట్రైలర్ ను దసరా పండుగ సందర్భంగా విడుదల చెయ్యగా.. ఇప్పుడు తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక యాక్షన్ అండ్ థ్రిల్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మరో తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్

కోలీవుడ్, టాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న నయనతార సైరా నరసింహా రెడ్డి వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత మరో తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళ మూవీస్ తో బిజీగా ఉంటున్న నయనతార తెలుగు మూవీస్ ను సెలెక్టివ్ గా ఎంపిక చేసుకుంటున్నారు. ఒక కొరియన్ మూవీ కి ఇంప్రెసయిన రానా దగ్గుబాటి ఆ మూవీ రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. ఈ మూవీ లో హీరోయిన్ కాప్ గా కనిపిస్తారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సంక్రాంతి బ‌రిలో ‘వెంకీమామ’?

ఇద్దరు కథానాయకులు కలసి వెండితెరపై కనిపిస్తే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఇక ఆ హీరోలిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవాళ్ళైతే డబుల్ బొనాంజా దక్కినట్టే. ఇప్పుడు ‘వెంకీమామ’తో అదే జరుగుతోంది. నిజజీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో... పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా నాయికలుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌కు కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో నాయకానాయికలపై తెరకెక్కించిన పాటతో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాని ‘పిల్ల జమీందార్’కు 8 ఏళ్ళు

“ఆనందం అనేది డబ్బులోనో, పబ్బుల్లోనో, కార్లలోనో లేదు... ఒక మనిషిలో మనిషిని చూడడంలోనే ఉందని” చాటి చెప్పిన చిత్రం ‘పిల్ల జమీందార్’. నేచురల్ స్టార్ నాని, హరిప్రియ జంటగా నటించిన ఈ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింలో అవసరాల శ్రీనివాస్, బిందు మాధవి, రావురమేష్, ధన్‌రాజ్, ‘తాగుబోతు’ రమేష్, ఎం.ఎస్.నారాయణ, ‘వెన్నెల’ కిషోర్, నాగినీడు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కొరియన్ ఫిల్మ్ ‘ఎ మిలియనియర్స్ ఫస్ట్ లవ్” స్పూర్తితో ‘పిల్ల జమీందార్’ను తెరకెక్కించాడు దర్శకుడు జి.అశోక్. ఈ చిత్రాన్ని శ్రీ శైలేంద్ర సినిమాస్ బ్యానర్‌పై డి.ఎస్.రావు నిర్మించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ్యూజికల్ హిట్... ‘క్రిమినల్’కు పాతికేళ్ళు

‘కింగ్’ నాగార్జున కెరీర్ లో పలు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘క్రిమినల్’ ఒకటి. నాగ్‌కు జోడీగా మనీషా కోయిరాలా, రమ్యకృష్ణ నటించిన ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, నాజర్, శరత్‌బాబు, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సుధ, గుల్షన్ గ్రోవర్ తదితరులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు. హాలీవుడ్ మూవీ ‘ది ఫ్యుజిటివ్’(1993) స్ఫూర్తితో ‘క్రిమినల్’ను తెరకెక్కించాడు బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్.

Team TFNవాట్సాప్
Double Dhamaka for Superstar Rajinikanth Fans In 2020?,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Double Dhamaka for Rajinikanth Fans,Superstar Rajinikanth Upcoming Movies 2020,Rajinikanth Latest News
సినిమా వార్తలు

2020లో రజినీ డ‌బుల్ ధ‌మాకా?

ఏడాదికో సినిమా లేదా రెండు మూడు సంవ‌త్స‌రాల‌కో సినిమాలో న‌టించే సూప‌ర్ స్టార్ రజినీకాంత్... 2018లో 'కాలా', '2.0' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ ఏడాది ‘పేట’తోనే సరిపెట్టిన సూపర్ స్టార్... 2020లో రెండు సినిమాల‌తో అభిమానుల‌కు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌నున్నట్టు కోలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘96’ రీమేక్

పాత్రకు తగ్గట్టుగా తనని తాను మలచుకోవడం సమంత స్టైల్. అందుకే టాలీవుడ్, కోలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పలు విజయాలను సొంతం చేసుకుంటోంది. ఇటీవల ‘ఓ బేబీ’తో మరో ఘనవిజయాన్ని త‌న ఖాతాలో వేసుకున్న ఈ చెన్నై బ్యూటీ... ప్రస్తుతం '96' రీమేక్‌లో నాయికగా నటిస్తోంది. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మిస్తుండగా... ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ సి. ప్రేమ్‌కుమార్ తెరకెక్కిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
30 Years for Chiranjeevi Musical Hit Bala Gopaludu,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Chiranjeevi Musical Hit Bala Gopaludu Completed 30 Years,30 Years for Bala Gopaludu,Bala Gopaludu Telugu M
సినిమా వార్తలు

మ్యూజిక‌ల్ హిట్‌ ‘బాలగోపాలుడు’కు 30 ఏళ్ళు

నటసింహ నందమూరి బాలకృష్ణ పంచె కట్టుతో వెండితెరపై దర్శనమిచ్చిన చిత్రాల్లో సింహభాగం విజయం సాధించినవే కావడం విశేషం. అంతేకాదు... అలా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో పలు చిత్రాలు మ్యూజిక‌ల్ హిట్స్‌గానూ అలరించాయి. అటువంటి సినిమాల్లో ‘బాలగోపాలుడు’ ఒకటి. బాలకృష్ణ జోడీగా సుహాసిని నటించగా రేఖ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, జగ్గయ్య, మోహన్‌బాబు, గిరిబాబు, మల్లికార్జునరావు, సంయుక్త, మాస్టర్ కళ్యాణ్‌రామ్, బేబి విజ‌య (రాశి) తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పి.బి. ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఆర్.వి.ప్రసాద్ నిర్మించారు.

Team TFNవాట్సాప్
19 Years for Trend Setting Movie Nuvve Kavali,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Trend Setting Movie Nuvve Kavali Completes 19 Years,19 Years for Nuvve Kavali Movie,Nuvve Kavali Telugu Movie
సినిమా వార్తలు

ట్రెండ్ సెట్టింగ్‌ మూవీ ‘నువ్వేకావాలి’కి 19 ఏళ్ళు

తెలుగునాట పలు విజయవంతమైన ప్రేమకథా చిత్రాలు సందడి చేసాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే ట్రెండ్‌ను సృష్టించాయి. అలా... ట్రెండ్ సెట్టర్‌గా నిలచిన చిత్రాలలో ముందు వరుసలో ఉండే సినిమా ‘నువ్వేకావాలి’. ప్రేమకథా చిత్రాల ప‌రంగా కొత్త ఒరవడిని సృష్టించిన ఈ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో తరుణ్, రిచా జంటగా నటించ‌గా... సాయి కిరణ్, వర్ష, గిరిబాబు, చలపతిరావు, సునీల్, మెల్కోటే, సుధ, ‘ఢిల్లీ’ రాజేశ్వరి, కోవై సరళ, అన్నపూర్ణ ముఖ్య భూమికలు పోషించారు. లైలా ప్రత్యేక గీతంలోనూ, ప్రేమ అతిథి పాత్ర‌లోనూ మెరిసారు. మలయాళ చిత్రం ‘నిరమ్’(1999)కు రీమేక్‌గా రూపొందిన ‘నువ్వేకావాలి’కి కె. విజ‌య భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం…

Team TFNవాట్సాప్
Sukumar And Chiranjeevi Project On Cards?,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Sukumar And Chiranjeevi Project Details,Sukumar New Movie with Megastar Chiranjeevi,Chiranjeevi Latest News
సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయ‌నున్న సుకుమార్‌?

‘లూసిఫర్’... కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ కథానాయకుడిగా న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ తెరకెక్కించిన భారీ బ‌డ్జెట్‌ మలయాళ చిత్రం. మాలీవుడ్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిల‌చిన ఈ యాక్ష‌న్ డ్రామా... త్వ‌ర‌లో తెలుగునాట‌ రీమేక్ కానుంది. `లూసిఫ‌ర్‌` రీమేక్ హ‌క్కుల‌ను మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సొంతం చేసుకోగా.... మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నార‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

రెండో షెడ్యూల్‌లో రాజ్‌తరుణ్‌ 'ఒరేయ్‌.. బుజ్జిగా'

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా 'ఒరేయ్‌.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఇటీవలే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్‌ ఈ రోజు నుండి ప్రారంభమైంది.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'అల వైకుంఠపురములో' రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉన్న సంగతి కూడా తెలిసిందే. అయితే సంక్రాంతి కి రిలీజ్ అవుతుంది అని ప్రచారంలో ఉంది కానీ డేట్ మాత్రం ఇప్పటివరకూ చెప్పలేదు. ఫైనల్ గా ఈ రోజు రిలీజ్ డేట్ ను కూడా చెప్పేసారు. సంక్రాంతి పండుగా సందర్భంగా జనవరి 12 వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్నీ ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

క్రేజీ లొకేషన్ లో 'వి' మూవీ షూట్..!

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని సిల్వర్ జూబ్లీ సినిమా 'వి' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రస్తుతం నార్త్ ఇండియాలో షూట్ జరుపుకుంటుండగా.. ఈ లోపు మనాలిలో మరో లొకేషన్ కోసం వెతుకుతున్నారట. అక్క కొండా చరియలలో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట.

TFN Adminవాట్సాప్

షేర్