విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. కేవలం హీరోగానే కాదు.. మంచి రైటర్ గా కూడా అడివి శేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఇటీవల ‘ఎవరు’ సినిమాతో కూడా మంచి హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం అడివి శేష్ చేతిలో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో గత ఏడాది తనకు మంచి సక్సెస్ ఇచ్చిన ‘గూఢచారి’ సీక్వెల్ కాగా తో మరొకటి మహేష్ బాబు, సోనీ సంస్థల సంయుక్తంగా నిర్మించనున్న మేజర్.
అయితే ‘మేజర్’ సినిమా కోసం అడివి శేష్ చాలా కష్టపడుతున్నాడట. ఈ సినిమాలో శేష్ రెండు భిన్నమైన లుక్స్ లో కనిపిస్తాడట. అందులో ఒక పాత్ర కోసం సుమారు 10 కిలోల వరకు బరువు తగ్గుతున్నాడట. ఇందుకోసం కష్టమైన డైట్ ను కూడా తీసుకుంటున్నాడట. కాగా వాస్తవ ఘటనల ఆధారంగా.. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: