నేను ‘రూలర్’ అంటున్న బాలకృష్ణ

Balakrishna New Movie Titled As Ruler,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Balakrishna New Movie Title,Balakrishna New Movie,Balakrishna Next Movie Updates,Balakrishna New Movie Ruler

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మ‌రోవైపు డ‌బ్బింగ్ వ‌ర్క్ కూడా మొద‌లుపెట్టినట్టు తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మొదట ఈ సినిమాకు ‘జడ్జిమెంట్’ అనే పేరు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరో టైటిల్ తెరపైకి వచ్చింది. ‘రూలర్’ అనే టైటిల్ నే ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

కాగా ఈ సినిమాలో బాల‌య్య‌కి జోడీగా వేదిక‌, సోనాల్ చౌహాన్ న‌టిస్తుండ‌గా… కీల‌క పాత్ర‌ల్లో భూమికా చావ్లా, జ‌య‌సుధ‌, ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తున్నారు. హ్యాపీ మూవీస్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ పండుగ కానుకగా ఈ ఏడాది చివ‌ర‌లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్రయూనిట్. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన `జై సింహా` మంచి హిట్ కొట్టింది.. ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొడతారేమో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 17 =