చిరు కోసం దేవాదాయ‌శాఖ‌ను ట‌చ్ చేయ‌నున్న కొర‌టాల‌?

Koratala Siva Plans Interesting Backdrop For #Chiru152,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Director Koratala Siva Interesting Backdrop For #Chiru152,Koratala Siva Upcoming Project with Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ తో రూపొందుతున్న ఈ సినిమాలో చిరు దేవాదాయశాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపించనున్నట్టు సమాచారం. అంతేకాదు… ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్తొకటి ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేమిటంటే… తన గత చిత్రాలైన ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’లో వివిధ శాఖలకు సంబంధించిన సామాజిక అంశాలను టచ్ చేసిన కొరటాల… ఇప్పుడు చిరు కాంబినేషన్ మూవీ కోసం దేవాదాయశాఖలోని లొసుగులను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ శాఖ నిర్లక్ష్యానికి గురవుతున్న దేవుడి గుళ్ళు, తద్వారా సంఘానికి కలిగే చేటు వంటి అంశాలతో పాటు… దేవాల‌య భూములు, దేవుడి మాన్యాలు ఏ విధంగా కబ్జా అవుతున్నాయో, వాటిని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో వంటి అంశాలనూ త‌న‌దైన శైలిలో తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ని భోగట్టా. మరి తనకు అచ్చొచ్చిన ఫార్ములానే న‌మ్ముకున్న కొర‌టాల‌కు… ఈ సారి కూడా అది వర్కవుట్ అవుతుందేమో చూడాలి.

కాగా… కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. 2020 ఉగాది కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.