తమిళ బ్యూటీ సాయిపల్లవి మలయాళంలో చేసిన ‘అథిరన్’ సినిమా ఎంత విజయం సాధించిందో తెలుసు. వివేక్ దర్శకత్వంలో సాయి పల్లవి, ఫహాద్ ఫాజిల్, ప్రకాశ్‌రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘అథిరన్’ మూవీ సూపర్‌హిట్ అయింది. ఇక ఫిదా సినిమాతో సాయి పల్లవికి తెలుగులో కూడా మంచి క్రేజ్ రావడంతో ‘అథిరన్’ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇన్ ట్రూప్ ఫిలిమ్స్ సమర్పణలో జయంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. నవంబర్ 15వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
రెంజి పానికర్, లియోనా లిషోయ్, శాంతి కృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ఎం. రాజశేఖర్‌రెడ్డి, పాటలు: చరణ్ అర్జున్, మధు పమిడి కాల్వ, ఎడిటింగ్: అయూబ్ ఖాన్, కెమెరా: అను మోతేదత్, స్ర్కీన్‌ప్లే: పి.ఎఫ్. మాథ్యూస్, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్: దక్షిణ్ శ్రీన్వాస్, నేపథ్య సంగీతం: జిబ్రాన్, స్వరాలు: పి.ఎస్. జయహరి, దర్శకత్వం: వివేక్, నిర్మాతలు: ఎ.కె. కుమార్, జి. రవికుమార్.
మరి మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: