ఆఖరి షెడ్యూల్‌ లో ‘ఎంత మంచివాడవురా’

Entha manchivaduraa movie last schedule update,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Entha manchivaduraa movie Shooting Updates,Entha manchivaduraa movie Latest News,Entha manchivaduraa Telugu movie

‘118’ ఘనవిజయం తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే మూడో షెడ్యూలు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఆఖరి షెడ్యూలుకు సిద్ధమవుతోంది. ఇక ఆఖరి షెడ్యూల్‌ని కేరళలోని మున్నార్‌ తదితర సుందరమైన ప్రదేశాల్లో ఈ నెల 31 నుంచి నవంబర్‌ 10 వరకూ షూట్‌ చేయనున్నారట. అక్కడ రెండు పాటలు, కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. కల్యాణ్‌రామ్‌ – స‌తీశ్ వేగేశ్న‌ కాంబినేషన్ లో మంచి వేల్యూ బుల్ సినిమా తీస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది . అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయి. అక్టోబర్‌ 9 నుంచి 22 వరకు రామోజీ ఫిల్మ్ సిటీలోనూ, హైదరాబాద్‌ పరిసరాల్లోనూ మూడో షెడ్యూల్‌ చేశాం. ప్రధాన తారాగణం పై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించాం. ఈ నెలాఖరు నుంచి డబ్బింగ్‌ కార్యక్రమాలు కూడా మొదలుపెడతాం. జనవరి 15న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు.

కాగా శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంకా తనికెళ్ళ భరణి, విజయ్ కుమార్, నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + one =