సరిలేరు నీకెవ్వరు నుండి మహేష్ పోస్టర్ రిలీజ్

Sarileru Neekevvaru Movie Diwali Special Poster Unveiled,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Sarileru Neekevvaru Movie Updates,Mahesh Babu Look in Sarileru Neekevvaru,Mahesh Babu Latest News 2019,Sarileru Neekevvaru Movie Special Poster

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెంట‌ర్ సెట్‌లో యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. తాజాగా విలన్ హౌస్ షెడ్యూల్‌ పూర్త‌య్యింది. చివరి షెడ్యూల్ కోసం నవంబర్ 1 నుంచి జరగనుంది. ఈ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ కేరళకు వెళ్లనుందట. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టు స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నిన్న చెప్పినట్టే ఈ రోజు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా… సాయంత్రం మహేష్ బాబు స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. దీంట్లో మహేశ్ బాబు రాయల్ ఎన్ ఫీల్డ్ బండిపై.. కళ్లకు సన్ గ్లాసులు, టీషర్టు, ట్రెండీ ప్యాంట్స్ లో చూడగానే ఆకట్టుకునేలా ఉన్నాడు.

కాగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయనున్నారు. ఇక మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.