కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇక ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనుండటంతో… చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలోనే రేపు దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను ఈ రోజు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అనుకున్నట్టే ఈ సినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ ను చూస్తే పోలీస్ యూనిఫాంలో ఉన్న బాలయ్య చేత్తో పెద్ద సుత్తిని పట్టుకుని ఆగ్రహంగా కనపడుతున్నారు. ఈ పోస్టర్ ను చూస్తుంటే… ఓ భారీ యాక్షన్ సన్నివేశానికి సంబంధించినట్టుగా కనపడుతోంది.
కాగా ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, భూమిక కీలక పాత్రలను పోషిస్తున్నారు. సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: