గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అల … వైకుంఠపురములో … మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. పూజ హెగ్డే కథానాయిక కాగా సుశాంత్, జయరామ్, టబు, నవదీప్ , నివేత పేతురాజ్ , సునీల్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. థమన్ S సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అల … వైకుంఠపురములో … మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజయి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. థమన్ S స్వరకల్పన లో సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతాన్ని సిద్ శ్రీరామ్ ఆలపించిన సామజవరగమనా సాంగ్ 50 మిలియన్స్ వ్యూస్ సాధించి రికార్డ్ నెలకొల్పింది. దీపావళి పండగ సందర్భంగా అల … వైకుంఠపురములో … మూవీ సెకండ్ సింగిల్ అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ తో రిలీజయింది. థమన్ S స్వరకల్పన లో కాసర్ల శ్యామ్ రచించిన రాములో రాములా గీతాన్ని అనురాగ్ కులకర్ణి, మంగ్లీ గానం చేశారు. రాములో రాములా మాస్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూ పొందుతున్న హ్యాట్రిక్ మూవీ అల … వైకుంఠపురములోపై అంచనాలు భారీ గా ఉన్నాయి.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























