ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 49
ఏఎన్నార్ ‘సిపాయి చిన్నయ్య’కు 50 ఏళ్ళు
నాగార్జున ‘ప్రెసిడెంటు గారి పెళ్ళాం’కు 27 ఏళ్ళు
ఎనర్జిటిక్ స్టార్ రామ్ "రెడ్ " మూవీ ప్రారంభం
కేరళ లో సరిలేరు నీకెవ్వరు మూవీ ఆఖరి షెడ్యూల్
'పెళ్లిచూపులు' పిల్లకు తెలుగులో ఛాన్స్
వెంకటేష్ ‘ప్రేమంటే ఇదేరా’కు 21 ఏళ్ళు
క్లైమాక్స్‌కు చేరుకున్న ‘ప్రతి రోజూ పండగే’
కొడైకెనాల్‌లో బాలయ్య సందడి?
‘విజిల్’ నాలుగు రోజుల కలెక్షన్స్
రామ్ # RED లాంచ్ డేట్ ఖరారు

'118' కాంబినేషన్ రిపీట్

తక్కువ నిడివితో వస్తున్న 'ఆవిరి'

S5 No Exit మూవీ షూటింగ్ ప్రారంభం

అది 'తేరి' రీమేక్ కాదండి బాబు..!
అన్వేషణ మూవీ సీక్వెల్ అన్వేషణ 2
రవితేజ మూవీ #RT66 హీరోయిన్
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మూవీస్ దర్శకుడు గోపీచంద్ మలినేని హ్యాట్రిక్ మూవీ కి రంగం సిద్ధమైంది. డాన్ శీను, బలుపు వంటి సూపర్ హిట్ మూవీస్ తరువాత మరో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఠాగూర్ మధు నిర్మాణ సారథ్యంలో గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రవితేజ హీరోగా ఎంటర్ టైనర్ మూవీ #RT 66 రూపొందనుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటిస్తున్న ఈ మూవీ లో హీరోయిన్ గా శ్రుతి హాసన్ ఎంపికయ్యారు.
ఏఎన్నార్ ‘సిపాయి చిన్నయ్య’కు 50 ఏళ్ళు
లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, మూవీ మొఘల్ డి.రామానాయుడు కాంబినేషన్ అనగానే... పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కళ్ళ ముందు కదలాడతాయి. అటువంటి సెన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రమే ‘సిపాయి చిన్నయ్య’. కెప్టెన్ భాస్కర్, సిపాయి చిన్నయ్యగా ఏయన్నార్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో కె.ఆర్.విజయ, భారతి కథానాయికలుగా నటించారు. సత్యనారాయణ, నాగభూషణం, ప్రభాకర్ రెడ్డి, మిక్కిలినేని, రావికొండలరావు, పండరీబాయి, ఋష్యేంద్రమణి ముఖ్య భూమికలు పోషించగా... “కళావాచస్పతి” జగ్గయ్య కీలకపాత్రలో దర్శనమిచ్చారు. జి.వి.ఆర్.శేషగిరిరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి భమిడిపాటి రాధాకృష్ణ కథను అందించారు.

సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ - 'లస్ట్ స్టోరీస్' రీమేక్ లో..!
హిందీలో వచ్చిన 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది. ఇక లస్ట్ స్టోరీస్ కథ విషయానికి వస్తే నలుగురు జంటల మధ్య వారి ప్రయాణానికి సంబంధించింది. కియారా అద్వానీ, రాధికా ఆప్టే, భూమి పెడ్నేకర్ మరియు మనీషా కొయిరాలా నటించారు.
నాగార్జున ‘ప్రెసిడెంటు గారి పెళ్ళాం’కు 27 ఏళ్ళు
‘కింగ్’ నాగార్జున, దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘ప్రెసిడెంటు గారి పెళ్ళాం’ ఒకటి. ముఖ్యంగా...`శివ` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత సరైన విజయం లేని నాగ్ కి ‘ప్రెసిడెంటు గారి పెళ్ళాం’ సక్సెస్ మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఇక టైటిల్ రోల్‌లో మీనా నటించిన ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, శ్రీకాంత్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, సుధ, అన్నపూర్ణ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ "రెడ్ " మూవీ ప్రారంభం
బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించే రెడ్ మూవీ ఈ రోజు పూజ కార్యక్రమం జరుపుకుంది. ముఖ్య అతిథులుగా పూరి జగన్నాథ్, ఛార్మి పాల్గొన్నారు. కృష్ణ పోతినేని సమర్పణలో స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరో గా రూపొందుతున్న రెడ్ మూవీ లో నివేత పేతురాజ్, మాళవిక శర్మ కథానాయికలు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
కేరళ లో సరిలేరు నీకెవ్వరు మూవీ ఆఖరి షెడ్యూల్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఆఖరి షెడ్యూల్ 3 వారాలపాటు కేరళ రాష్ట్రంలో జరుగనుంది. ఒక సాంగ్ ను, కొన్ని కీలక కుటుంబ సన్నివేశాలను దర్శకుడు అనిల్ తెరకెక్కిస్తారు. కేరళ లోని అతిరాపల్లి వాటర్ ఫాల్స్, తమిళనాడు పొల్లాచ్చి లోనూ షూటింగ్ జరుపు కోనుంది . ఈ షెడ్యూల్ ముగిసిన తరువాత మహేష్ బాబు, రష్మిక లపై అబ్రాడ్ లో సాంగ్స్ చిత్రీకరిస్తారు.
'పెళ్లిచూపులు' పిల్లకు తెలుగులో ఛాన్స్
‘పెళ్లి చూపులు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ వర్మ. అంతకుముందు పలు సినిమాల్లో నటించినా.. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్ గా పరిచయమై.. మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా హిట్ తో విజయ్ కెరీర్ కు గాడి పడింది కానీ. రీతూ వర్మకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పొచ్చు. దాంతో తమిళ .. మలయాళ భాషా చిత్రాలపై ఆమె దృష్టిపెట్టింది. అక్కడ అమ్మడికి బాగానే అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం మలయాళంలో దుల్కర్ సల్మాన్ జోడీగా 'కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్'లో నటిస్తోంది. ఇదే సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగు…
వెంకటేష్ ‘ప్రేమంటే ఇదేరా’కు 21 ఏళ్ళు
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా పలు రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ సందడి చేసాయి. వాటిలో ‘ప్రేమంటే ఇదేరా’ ఒకటి. వెంకటేష్‌కు జోడిగా ప్రీతీ జింతా నటించగా లక్ష్మి, కైకాల సత్యనారాయణ, శ్రీహరి, చంద్రమోహన్, రంగనాథ్, గిరిబాబు, ప్రసాద్‌బాబు, నర్రా వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, శివాజీరాజా, శివాజీ, రమాప్రభ, రజిత తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ, కె.అశోక్‌కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించారు. ‘ప్రేమించుకుందాం రా’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత వెంకటేష్, జయంత్ సి.పరాన్జీ కాంబినేషన్‌లో తెరకెక్కిన…
క్లైమాక్స్‌కు చేరుకున్న ‘ప్రతి రోజూ పండగే’
మెగా హీరో సాయితేజ్, యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. కుటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సత్యరాజ్, రావురమేష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
కొడైకెనాల్‌లో బాలయ్య సందడి?
‘జై సింహా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘రూలర్’. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గానూ, గ్యాంగ్ స్టర్ గానూ రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో బాలయ్య దర్శనమివ్వనున్నారు. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తుండగా భూమిక, ప్రకాష్ రాజ్, జయసుధ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఖైదీ కలెక్షన్స్ - తక్కువ థియేటర్స్ లో భీభత్సం!
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. 'దీపావళి' పండగ సందర్భంగా ఈ నెల 25వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ మధ్య కార్తీ సినిమాలు వరుసగా ప్లాప్ కావడంతో కార్తీ మార్కెట్ కాస్త తగ్గింది. దానితో ఆ ఎఫెక్ట్ 'ఖైదీ' సినిమాపై బాగానే పడింది. దీంతో మొదటి రోజు ఈ సినిమా 31 లక్షలు మాత్రమే వసూల్ చేసింది. కానీ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజు నుండి కలెక్షన్స్ పెరిగాయి. దాంతో టోటల్ గా 2 రోజులకు గాను తెలుగు లో సినిమా 1.3 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది.మొత్తం నాలుగు రోజులకు ఈ సినిమా 2.45 కోట్లు వసూల్ చేసింది. ఇక ఈ సినిమాకు…
‘విజిల్’ నాలుగు రోజుల కలెక్షన్స్
అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బిగిల్'. తెలుగులో 'విజిల్' అనే పేరుతో రిలీజ్ చేశారు. ఇక ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తమిళ్ లో అయితే దాదాపు 150 కోట్లకు దగ్గరలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇక్కడ 10 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 7.75 కోట్లు వసూల్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఏయే ఏరియాలో విజిల్ ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.
రామ్ # RED లాంచ్ డేట్ ఖరారు
మొత్తానికి వరుస ప్లాప్స్ తో కాస్త ఫామ్ తగ్గిన రామ్ కు పూరి ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ ఇచ్చి ఫామ్ లోకి తెచ్చాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తడం' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను నిన్ననే సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. 'రెడ్' అనే టైటిల్ ను ఈ సినిమాకు పెట్టారు.

'118' కాంబినేషన్ రిపీట్
వరుస పరాజయాల తర్వాత '118' సినిమాతో మంచి విజయం అందుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ఇప్పుడు 'ఎంత మంచి వాడవురా' అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. సతీష్ వేగేష్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఆఖరి షెడ్యూల్‌ని కేరళలోని మున్నార్ తదితర సుందరమైన ప్రదేశాల్లో ఈ నెల 31 నుంచి నవంబర్ 10 వరకూ షూట్ చేయనున్నారు. అక్కడ రెండు పాటలు, కీలక సన్నివేశాలు, పాటలు చిత్రీకరిస్తారు.
నా తొలి ప్రాధాన్యత రాజకీయాలకే- విశ్వనటభారతి విజయశాంతి
తమ అద్భుత, అభినయ చాతుర్యంతో, సామర్థ్యంతో తెలుగు తెరను ఏలిన కథానాయికలు ఎందరో ఉన్నారు. కంటి చూపుతో, కొంటె నవ్వుతో ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్లకు కొదవలేదు. అయితే కథానాయికగా ఒక కమాండింగ్ పొజిషన్ను ఎంజాయ్ చేసిన హీరోయిన్లు చాలా తక్కువ. పురుషాధిక్య రంగమైన చిత్ర పరిశ్రమలో అందచందాల ఆరబోతకు మాత్రమే పరిమితమయ్యే సెట్ ప్రాపర్టీ లాగా కాకుండా అన్నీ తానై కథను నడిపించి రెండున్నర దశాబ్దాల అత్యున్నత వైభవాన్ని చవి చూసిన కథానాయిక ఒకరున్నారు. బాక్సాఫీస్ హీరోలకు దీటైన స్టార్ డమ్ ను, ఇమేజ్ ని, క్రేజ్ ను సొంతం చేసుకొని హీరోయిన్ పాత్రల నేచర్ ను,స్టేచర్ ను, స్టేటస్ ను మార్చేసిన ఆ శిఖరాగ్ర స్ధాయి కథానాయిక…

తక్కువ నిడివితో వస్తున్న 'ఆవిరి'
యదార్ధ సంఘటన ఆధారంగా రవిబాబు దర్శకత్వంలో 'ఆవిరి' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో సినిమాపై అంచనాలు పెంచేసాడు రవిబాబు. 'స్పాట్ స్పిరిట్' అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రన్ టైమ్ లాక్ అయినట్టు తెలుస్తుంది. కేవలం 112 నిమిషాల 37 సెకండ్లు మాత్రమే ఈ సినిమా నిడివి ఉంది. అంటే కేవలం 2 గంటలకంటే తక్కువ మాత్రమే ఉంటుందన్నమాట. మరి హార్రర్ సినిమాలు నిడివి ఎంత తక్కువ ఉంటే అంతే మంచిది. అది దృష్టిలో పెట్టుకొనే రవిబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నాడు.

S5 No Exit మూవీ షూటింగ్ ప్రారంభం
సాగ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సన్ని కోమలపాటి దర్శకత్వం లో తారక రత్న, ప్రిన్స్, అవంతిక, రుతుజ సావంత్ ప్రధాన పాత్రలలో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతున్న S5 No Exit మూవీ షూటింగ్ ఈ రోజు ప్రారంభమయింది. సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ క్లాప్ తో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయింది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా తారక రత్న ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ లో అలీ ఫస్ట్ లుక్
టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నిజ జీవిత రాజకీయ నాయకుల పాత్రలతో కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. KRKR మూవీ లోని ఒక్కొక్క క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తూ RGV ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు. KRKR మూవీ లోని క్యారెక్టర్స్ కు దగ్గిర పోలికలున్న వ్యక్తులను ఎంపిక చేసుకొని RGV మూవీ ని తెరకెక్కిస్తున్నారు. మూడు సాంగ్స్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులలో మూవీ పై ఆసక్తి కలిగేలా చేశారు.

అది 'తేరి' రీమేక్ కాదండి బాబు..!
మాస్ మహారాజా రవితేజ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మొన్న దీపావళి పండుగ సందర్భంగా ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు.
అన్వేషణ మూవీ సీక్వెల్ అన్వేషణ 2
దర్శకుడు వంశీ దర్శకత్వంలో కార్తీక్, భానుప్రియ జంటగా అటవీ నేపథ్యం లో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ అన్వేషణ మూవీ 1985 సంవత్సరం మే నెలలో రిలీజయి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులకు వీనుల విందు చేశాయి . ఇప్పుడు అన్వేషణ మూవీ కి సీక్వెల్ వంశీ రూపొందిస్తారని సమాచారం.