కొడైకెనాల్‌లో బాలయ్య సందడి?

Ruler Makes Buzz in Kodaikanal,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ruler Movie Shooting Locations,Balakrishna Ruler Movie Latest News,Ruler Team in Kodaikanal,Balakrishna Latest News 2019

‘జై సింహా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘రూలర్’. ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ గానూ, గ్యాంగ్ స్టర్ గానూ రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో బాలయ్య దర్శనమివ్వనున్నారు. సోనాల్ చౌహాన్‌, వేదిక కథానాయికలుగా నటిస్తుండగా భూమిక‌, ప్రకాష్ రాజ్, జయసుధ ఇతర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. కాగా… తదుపరి షెడ్యూల్‌ను కొడైకెనాల్‌లో ప్లాన్ చేసార‌ని సమాచారం. ఇందులో భాగంగా… కథానాయకుడి ఫ్లాష్ బ్యాక్‌కు సంబంధించిన కొన్ని కీల‌క‌మైన ఎపిసోడ్స్‌ను తెరకెక్కించ‌నున్న‌ట్టు తెలిసింది.

ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + eleven =