ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 48
ఏయన్నార్ ‘దొరబాబు’కు 45 ఏళ్ళు

90 ML మూవీ షూటింగ్ పూర్తి
కమల్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో విక్రమ్?
హీరో నాగచైతన్య "లవ్ స్టోరీ "
‘ఇద్దరి లోకం ఒకటే’ రిలీజ్ డేట్ మారిందా?
హనీ ట్రాపర్‌గా `వింక్` బ్యూటీ?
సౌదీ అరేబియాకు వెళుతున్న అఖిల్ ?
డబుల్ సెంచరీ కొట్టిన 'విజిల్'
మలయాళం మూవీ రీమేక్ లో ..?
తమ్ముడి డైరెక్టర్ కు అన్న గ్రీన్ సిగ్నల్

రామ్ #RED - రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
పవర్ ఫుల్ క్యారెక్టర్ లో త్రిష
ఆవిరి మూవీ ఫ్యామిలీ థ్రిల్లర్ -రవిబాబు

పోలీస్ ఆఫీసర్ గా అంజలి..!

టైటిల్ కొట్టడానికి అన్ని అర్హతలు ఉన్నవాడు వరుణ్

అసురన్ హిందీ రీమేక్ లో..?
కొరటాలతో సినిమా ఉంటుంది కానీ..!
సైరా సినిమా రిలీజ్ కాకముందు నుండే చిరు తరువాత సినిమా కొరటాల శివతో వస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరు మీదున్నాయి. ఈ సినిమాను నవంబర్‌లో మొదలుపెట్టి.. కంటిన్యూ మార్చి నాటికి షూటింగ్ కంప్లీట్ చేసిన ఏప్రిల్ చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిషను హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం.
ఏయన్నార్ ‘దొరబాబు’కు 45 ఏళ్ళు
లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, దిగ్గజ దర్శకుడు తాతినేని రామారావుది విజయవంతమైన జోడీ. వీరిద్దరి కలయికలో పలు చిత్రాలు తెరకెక్కగా... వాటిలో సింహభాగం విజయం సాధించడం విశేషం. అటువంటి సెన్సేషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమాల్లో ‘దొరబాబు’ ఒకటి. ఏయన్నార్‌కు జోడిగా మంజుల నటించగా... చంద్రకళ, కైకాల సత్యనారాయణ, జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, రాజబాబు, డి.రామానాయుడు తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.

90 ML మూవీ షూటింగ్ పూర్తి
కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై కార్తికేయ, నేహా సోలంకి జంటగా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ 90ML మూవీ రూపొందుతుంది . యూత్ లో క్రేజ్ ఉన్న కార్తికేయ మోడరన్ దేవదాసు గా నటిస్తున్న ఈ మూవీ లో రవి కిషన్, రావు రమేష్, అలీ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. MBA గోల్డ్ మెడలిస్ట్ దేవదాసు ఆథరైజ్డ్ డ్రింకర్ గా మారడం ఈ మూవీ కాన్సెప్ట్. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
కమల్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో విక్రమ్?
‘మరుదనాయగం’... లోకనాయకుడు కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్. రెండు దశాబ్దాలకు పూర్వమే కమల్ స్వీయదర్శకత్వంలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ హిస్టారికల్ డ్రామా... కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. కట్ చేస్తే... ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెలుగులోకి వచ్చింది. అంతేకాదు... ఇందులో ఓ టాలెంటెడ్ స్టార్ ప్రధాన పాత్ర పోషిస్తాడనే ప్రచారం సాగుతోంది.
హీరో నాగచైతన్య "లవ్ స్టోరీ "
అమిగోస్ క్రియేషన్స్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర మూవీస్ బ్యానర్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం లో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ కి లవ్ స్టోరీ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. పవన్ సంగీతం అందించారు. లవ్ స్టోరీ మూవీ ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 వ తేదీ రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు.
‘ఇద్దరి లోకం ఒకటే’ రిలీజ్ డేట్ మారిందా?
యువ కథానాయకుడు రాజ్ తరుణ్, అందాల తార షాలిని పాండే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు జి.ఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాని నవంబర్ 9న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే, ఇప్పుడీ చిత్రాన్ని డిసెంబర్ 25కి వాయిదా వేసే దిశగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
హనీ ట్రాపర్‌గా `వింక్` బ్యూటీ?
ప్రియా ప్రకాష్ వారియర్... ఒక్క కన్నుగీటుతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కేరళ కుట్టి. మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’(తెలుగులో ‘లవర్స్ డే’)తో హీరోయిన్‌గా పరిచయమైన ఈ వింక్ బ్యూటీ... ప్రస్తుతం యంగ్ హీరో నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో నాయికగా నటిస్తోంది. తెలుగులో తనకిదే తొలి చిత్రం కావడం విశేషం. అంతేకాదు... ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌లో కనిపించనుందట ప్రియ.
సౌదీ అరేబియాకు వెళుతున్న అఖిల్ ?
అఖిల్ అక్కినేని హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అఖిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా దర్శనమివ్వనున్నట్టు సమాచారం. అందమైన ప్రేమకథతో పాటు కుటుంబ బంధాలకు పెద్ద పీట వేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రంలో స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నాయికగా నటిస్తుండగా... గోపిసుందర్ స్వరాలు సమకూరుస్తున్నాడు.
డబుల్ సెంచరీ కొట్టిన 'విజిల్'
అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బిగిల్'. తెలుగులో 'విజిల్' అనే పేరుతో రిలీజ్ చేశారు. ఇక ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇక్కడ 10 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు 8.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో త్వరలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించబోతుంది.
మలయాళం మూవీ రీమేక్ లో ..?
వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు సుమంత్. ‘మళ్లీరావా’ సినిమాతో ట్రాక్‌లోకి వచ్చిన సుమంత్ ఆ తర్వాత వచ్చిన ‘ఇదంజగత్’ 'సుబ్రహ్మణ్యపురం' సినిమాలు తీసినా అవి సరిగా విజయం దక్కించుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు. అయితే ఈ సారి రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది.
తమ్ముడి డైరెక్టర్ కు అన్న గ్రీన్ సిగ్నల్
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను... తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్ కె.కె.రాధామోహన్ సమర్పించారు.ఇక దీపావళి కానుకగా అక్టోబర్ 25న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ గా నిలిచింది. అన్నిచోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌తో కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు కత్తి కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అన్న ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ఇక కలెక్షన్స్ కూడా మంచిగానే రాబడుతుంది.

ఖైదీ కార్తీ అని పిలుస్తుంటే థ్రిల్లింగ్ గా ఉంది - కార్తి
'మా నగరం' ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను... తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్ కె.కె.రాధామోహన్ సమర్పించారు.ఇక దీపావళి కానుకగా అక్టోబర్ 25న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని సూపర్ హిట్ సూపర్ హిట్ కొట్టింది. అన్నిచోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌తో కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రోజురోజుకు పెరుగుతున్న ప్రేక్షకాదరణతో ముఖ్యంగా మహిళా ప్రేక్షకాదరణతో ఆల్ సెంటర్స్ హౌస్ ఫుల్స్ తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్…

రామ్ #RED - రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తడం' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను మొన్న రిలీజ్ చేయగా.. ఈ రోజు ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఇక నవంబర్ 16వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు.
పవర్ ఫుల్ క్యారెక్టర్ లో త్రిష
రెండు దశాబ్దాలుగా కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను తన అందం, అభినయం తో ఆకట్టుకున్న త్రిష , నవతరం కథానాయికలతో పోటీ పడి విభిన్న కథాంశాల చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై M శరవణన్ దర్శకత్వంలో త్రిష ప్రధాన పాత్రలో విదేశీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా రాంగి తమిళ మూవీ రూపొందుతుంది. ప్రముఖ దర్శకుడు AR మురుగదాస్ రాంగి మూవీ కి కథ ను అందించడం విశేషం.
నేటికి నాలుగు పదుల సర్దార్ పాపారాయుడు వివరాలు- విశేషాలు
భారత స్వాతంత్య్ర పోరాటంలో తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఒక సమర యోధుడు , స్వాతంత్య్రం వచ్చిన 30 సంవత్సరాల తర్వాత సమాజంలోకి వచ్చి ఆ స్వాతంత్య్ర ఫలాలు దుర్వినియోగం అవుతుంటే ఎలా స్పందించాడనే ఉత్తేజపూరితమైన ఊహకు దృశ్య రూపమే సర్దార్ పాపారాయుడు.
ఆవిరి మూవీ ఫ్యామిలీ థ్రిల్లర్ -రవిబాబు
దిల్ రాజు సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై రవిబాబు దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఆవిరి నవంబర్ 1వ తేదీ రిలీజ్ కానుంది. రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణిశంకర్ , ముక్తార్ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించారు. థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో స్పెషలిస్ట్ అయిన రవి బాబు ఆవిరి మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుని, మూవీ పై హైప్ ను క్రియేట్ చేశారు.
బ్లాక్ బస్టర్ పింక్ మూవీ తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామా, రెండవది బ్లాక్ బస్టర్ హిందీ మూవీ పింక్ తెలుగు రీమేక్ .పింక్ మూవీ తమిళం లో అజిత్ హీరోగా నెర్కొండ పార్వై గా రీమేక్ అయి ఘనవిజయం సాధించింది.. పింక్ మూవీ తెలుగు రీమేక్ కు దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ సమకూరుస్తున్నారని సమాచారం.

పోలీస్ ఆఫీసర్ గా అంజలి..!
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు లో నిశ్శబ్ధం టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ అవుతుంది.

టైటిల్ కొట్టడానికి అన్ని అర్హతలు ఉన్నవాడు వరుణ్
చూస్తుండగానే బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు దశకు వచ్చేసింది. నచ్చినా.. నచ్చకపోయినా తిట్టుకుంటూ అయినా షో టైం అయిందంటే అందరూ టీవీ ముందుకు వచ్చి చూసే రియాలిటీ షో బిగ్ బాస్. 16 కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ షో ఫైనల్ గా టాప్ 5 కంటెస్టెంట్లతో చివరి అంకానికి చేరింది. వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్, రాహుల్, అలీ వీరిలో ఎవరు బిగ్ బాస్ టైటిల్ ను గెలుచుకుంటారో అన్న సస్పెన్స్ కు ఈ ఆదివారంతో తెర పడనుంది.

అసురన్ హిందీ రీమేక్ లో..?
తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా తమిళంలో వచ్చిన 'అసురన్' ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. వెంకటేష్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇటీవలే దీనిపైఅధికారిక ప్రకటన చేశారు.