‘పెళ్లిచూపులు’ పిల్లకు తెలుగులో ఛాన్స్

Ritu Varma Signs Another Telugu Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Actress Ritu Varma New Movie in Telugu,Ritu Varma Next Another Telugu Movie,Ritu Varma Latest News 2019

‘పెళ్లి చూపులు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ వర్మ. అంతకుముందు పలు సినిమాల్లో నటించినా.. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్ గా పరిచయమై.. మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా హిట్ తో విజయ్ కెరీర్ కు గాడి పడింది కానీ. రీతూ వర్మకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పొచ్చు. దాంతో తమిళ .. మలయాళ భాషా చిత్రాలపై ఆమె దృష్టిపెట్టింది. అక్కడ అమ్మడికి బాగానే అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం మలయాళంలో దుల్కర్ సల్మాన్ జోడీగా ‘కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయడిత్తాల్‌’లో నటిస్తోంది. ఇదే సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్‌కు ‘కనులు కనులను దోచాయంటే’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత రీతూ వర్మకి తెలుగులో మరో ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రీతూవర్మను ఎంపిక చేసుకున్నారట. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − eight =