కేరళ లో సరిలేరు నీకెవ్వరు మూవీ ఆఖరి షెడ్యూల్

Sarileru Neekevvaru Final Shooting Schedule in Kerala,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Sarileru Neekevvaru Movie Final Shooting,Sarileru Neekevvaru Shooting Latest Updates

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఆఖరి షెడ్యూల్ 3 వారాలపాటు కేరళ రాష్ట్రంలో జరుగనుంది. ఒక సాంగ్ ను, కొన్ని కీలక కుటుంబ సన్నివేశాలను దర్శకుడు అనిల్ తెరకెక్కిస్తారు. కేరళ లోని అతిరాపల్లి వాటర్ ఫాల్స్, తమిళనాడు పొల్లాచ్చి లోనూ షూటింగ్ జరుపు కోనుంది . ఈ షెడ్యూల్ ముగిసిన తరువాత మహేష్ బాబు, రష్మిక లపై అబ్రాడ్ లో సాంగ్స్ చిత్రీకరిస్తారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెంట్స్, GMB ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు మూవీ లో విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి పండుగకు ఇంటిల్లిపాదీ నవ్వులు
పంచనుంది. దీపావళి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విజయశాంతి, మహేష్ బాబు పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ లో అధిక లైక్స్ సాధించిన పోస్టర్ గా మహేష్ బాబు పోస్టర్ రికార్డ్ క్రియేట్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − nineteen =