రామ్ # RED లాంచ్ డేట్ ఖరారు

Ram Pothineni Red Movie Launch Date Locked,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ram Pothineni Red Movie Launch Date,Ram Pothineni Red Movie Updates,Ram Pothineni New Movie Red,Red Movie Latest News

మొత్తానికి వరుస ప్లాప్స్ తో కాస్త ఫామ్ తగ్గిన రామ్ కు పూరి ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ ఇచ్చి ఫామ్ లోకి తెచ్చాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను నిన్ననే సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ‘రెడ్’ అనే టైటిల్ ను ఈ సినిమాకు పెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా లాంచ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. రేపు లాంఛనంగా పూజా కార్యక్రమాలుతో సినిమాను ప్రారంభించనున్నారు. నవంబర్ 16వ తేదీ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంబంచనున్నారు.

కాగా ఈ సినిమాలో రామ్ కు జోడీగా నివేదా పేతురేజ్, మాళవిక శర్మ హీరోయిన్లు గా నటించనున్నారు. స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక రామ్ – కిషోర్ తిరుమల కాంబినేషన్ ఇది మూడో చిత్రం. మొదటి చిత్రం నేను శైలజ హిట్ అవ్వగా, రెండో సినిమా ఉన్నది ఒకటే జిందగీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఇప్పుడు మరోసారి కలిసి వస్తున్నారు. మరి ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ తెచ్చి పెడుతుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =