నాగార్జున ‘ప్రెసిడెంటు గారి పెళ్ళాం’కు 27 ఏళ్ళు

Nagarjuna President Gari Pellam Completes 27 Years,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,President Gari Pellam Movie Completes 27 Years,27 Years for President Gari Pellam Movie,President Gari Pellam Telugu Movie

‘కింగ్’ నాగార్జున, దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘ప్రెసిడెంటు గారి పెళ్ళాం’ ఒకటి. ముఖ్యంగా…`శివ‌` వంటి సెన్సేష‌న‌ల్ హిట్‌ త‌రువాత స‌రైన విజ‌యం లేని నాగ్ కి ‘ప్రెసిడెంటు గారి పెళ్ళాం’ స‌క్సెస్ మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఇక టైటిల్ రోల్‌లో మీనా న‌టించిన ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, శ్రీకాంత్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, సుధ, అన్నపూర్ణ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దిగ్గజ రచయిత వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన పాటలకు… స్వరవాణి కీరవాణి వీనుల‌విందైన బాణీలు అందించారు. “నువ్వు మల్లెతీగ”, “ఆ ఒడ్డు ఈ ఒడ్డు”, “తస్సా చెక్కా”, “ఉమ్మ కావాలి”, “మండూరి”, “పరువాల కోడి”… ఇలా ప్రతీ పాట అప్పట్లో విశేషాదరణ పొందింది. నాగార్జునకు అచ్చొచ్చిన‌ నిర్మాత‌ల్లో ఒక‌రైన వి.దొరస్వామిరాజు (వి.ఎం.సి.ప్రొడక్షన్స్ అధినేత‌) నిర్మించిన ఈ చిత్రం… మంచి విజయాన్ని నమోదు చేసింది. 1992 అక్టోబర్ 30న విడుదలైన ‘ప్రెసిడెంటు గారి పెళ్ళాం’… నేటితో 27 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − two =