విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా పలు రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ సందడి చేసాయి. వాటిలో ‘ప్రేమంటే ఇదేరా’ ఒకటి. వెంకటేష్‌కు జోడిగా ప్రీతీ జింతా నటించగా లక్ష్మి, కైకాల సత్యనారాయణ, శ్రీహరి, చంద్రమోహన్, రంగనాథ్, గిరిబాబు, ప్రసాద్‌బాబు, నర్రా వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, శివాజీరాజా, శివాజీ, రమాప్రభ, రజిత తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ, కె.అశోక్‌కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించారు. ‘ప్రేమించుకుందాం రా’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత వెంకటేష్, జయంత్ సి.పరాన్జీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ప్రేమంటే ఇదేరా’ కూడా అదే బాట పట్టడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, చంద్రబోస్ గీత రచన చేయగా… రమణ గోగుల స్వరసారథ్యంలో రూపొందిన పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. “నాలో ఉన్న ప్రేమ”, “వయసా చూసుకో”, “ఏమో ఎక్కడుందో”, “నైజాం బాబులు”, “మనసే ఎదురు తిరిగే”, “ఓ మేరి బుల్ బుల్ తార”, “బొంబాయి బొమ్మా” వంటి పాటలు యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా అలరించాయి. ఈ సినిమాని కన్నడంలో ‘ఓ ప్రేమవే’ పేరుతో పునర్నిర్మించారు. 1998 అక్టోబర్ 30న విడుదలై ఘన విజయం సాధించిన ‘ప్రేమంటే ఇదేరా’… నేటితో 21 ఏళ్ళు పూర్తిచేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: