లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను… తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్ కె.కె.రాధామోహన్ సమర్పించారు.ఇక దీపావళి కానుకగా అక్టోబర్ 25న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ గా నిలిచింది. అన్నిచోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌తో కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు కత్తి కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అన్న ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ఇక కలెక్షన్స్ కూడా మంచిగానే రాబడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా మరో న్యూస్ వినిపిస్తుంది. తమ్ముడికి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు అన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అంటే.. హీరో సూర్య తన తదుపరి చిత్రాన్ని ఖైదీ తో హిట్ కొట్టిన లోకేశ్ తో చేయడానికి నిర్ణయించుకొని అతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే దీనిలో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే. మరి తమ్ముడికి హిట్ ఇచ్చిన డైరెక్టర్ అన్నకు కూడా హిట్ ఇస్తాడేమో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: