రామ్ #RED – రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Red Movie Release Date Locked,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Red Movie Release Date,Red Telugu Movie Release Date,Ram Pothineni Red Movie,Red Movie Updates

కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో ‘రెడ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను మొన్న రిలీజ్ చేయగా.. ఈ రోజు ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఇక నవంబర్ 16వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అప్పుడే ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. వచ్చే ఏడాది 2020 ఏప్రిల్ 9 వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ ద్వారా అధికారికంగా తెలిపారు. మరి ఇంకా షూటింగే స్టార్ట్ కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ ను అప్పుడే ఫిక్స్ చేయడం విశేషమే.

కాగా ఈ సినిమాలో రామ్ కు జోడీగా నివేదా పేతురేజ్, మాళవిక శర్మ హీరోయిన్లు గా నటించనున్నారు. స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =