కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 47

షూటింగ్ అప్‌డేట్

వేస‌విలో ప్రారంభం కానున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శివ నిర్వాణ చిత్రం?

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కనున్న ఈ చిత్రంలో విజ‌య్ ఇదివ‌ర‌కు ఎన్న‌డూ చేయ‌ని పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. అంతేకాదు... 2020 వేస‌వి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుంద‌ని తెలిసింది. వైజాగ్‌, హైద‌రాబాద్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం... శివ నిర్వాణ ప్రీవియ‌స్ మూవీస్ `నిన్ను కోరి`, `మ‌జిలీ` త‌ర‌హాలో ఎమోష‌నల్ సాగుతుంద‌ని వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

Team TFNవాట్సాప్
Sree Vishnu reveals facts about Allu Arjun,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Actor Sree Vishnu About Allu Arjun,Allu Arjun advice changed Sree Vishnu life,Tollywood Celebs About Allu Arjun
సినిమా వార్తలు

అల్లు అర్జున్ వల్లే నా కెరీర్ టర్న్ అయింది

కెరీర్ మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'తిప్పరా మీసం' సినిమా అనే విభిన్నమైన కథతో వస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీవిష్ణు పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. అసలు తను కెరీర్ లో ఈ పొజిషన్లో ఉండటానికి అల్లు అర్జున్ ఇచ్చిన సలహాలే కారణమని కూడా చెప్పాడు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

నిశ్శబ్ధం మూవీ లో అంజలి ఫస్ట్ లుక్

హేమంత్ మధుకర్ దర్శకత్వం లో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో సస్పెన్స్ థ్రిల్లర్ నిశ్శబ్ధం మూవీ రూపొందుతుంది. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన నిశ్శబ్ధం మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రలలో నటించారు. స్టార్ రైటర్ కోన వెంకట్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన నిశ్శబ్ధం మూవీకి గోపిసుందర్ సంగీతం అందించారు. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటీనటులు నటించిన నిశ్శబ్ధం మూవీతెలుగు, తమిళ, మలయాళ , ఇంగ్లీష్, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శోభ‌న్ బాబు ‘సర్పయాగం’కు 28 ఏళ్ళు

స్టెత్ ప‌ట్టే ఓ డాక్ట‌ర్‌... త‌న కూతురుకి జ‌రిగిన అన్యాయానికి క‌త్తి ప‌ట్టి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనే క‌థాంశంతో తెర‌కెక్కిన చిత్రం `స‌ర్ప‌యాగం`. న‌ట‌భూష‌ణ్‌ శోభన్‌బాబు, రోజా తండ్రీకూతుళ్ళుగా న‌టించిన ఈ రివెంజ్ స్టోరీకి ప్ర‌ముఖ ర‌చ‌యిత‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రంలో వాణీ విశ్వనాధ్, శ్రీనివాస్ వర్మ, బ్రహ్మానందం, రఘునాథరెడ్డి, రేఖ‌, జ‌య‌ల‌లిత‌, సాయికుమార్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. విద్యాసాగ‌ర్‌ స్వరసారథ్యంలో రూపొందిన పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. “దిగు దిగు దిగు నాగ”, “ఏబీసీడి గుండెలో…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

స్నేహం గొప్పతనాన్ని చాటిచెప్పిన ‘నీ స్నేహం’కు 17 ఏళ్ళు

“కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట, రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం... రూపు రేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం” అంటూ స్నేహం గొప్పతనాన్ని చాటిచెప్పిన చిత్రం ‘నీ స్నేహం’. ఉదయ్ కిరణ్, జతిన్ ప్రాణ స్నేహితులుగా నటించగా... ఆర్తి అగర్వాల్ కథానాయికగా కనిపించింది. “కళాతపస్వి” కె.విశ్వనాథ్, గిరిబాబు, సుదీప, అజయ్, అలీ, శివాజీరాజా, హేమ, సుధ, సంగీత తదితరులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో దర్శనమిచ్చారు. ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎస్.రాజు నిర్మించగా... పరుచూరి మురళి తెరకెక్కించారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఫిబ్ర‌వ‌రి నుంచి వెంక‌టేష్‌, త‌రుణ్ భాస్క‌ర్ చిత్రం?

త‌న వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌. `గురు`, `ఎఫ్ 2` చిత్రాల్లో మ‌ధ్య వ‌య‌స్కుడి పాత్ర‌ల్లోనే క‌నిపించిన వెంకీ... రాబోయే `వెంకీమామ‌`లోనూ అదే త‌ర‌హాలో క‌నిపించ‌నున్నారు. ఇక త‌మిళ చిత్రం `అసుర‌న్‌`కి రీమేక్‌గా రూపొంద‌నున్న సినిమాలోనూ అదే బాణి. అంతేకాదు... త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న స్పోర్ట్స్ డ్రామాలోనూ అదే తీరుని కొన‌సాగించ‌నున్నార‌ట వెంకీ.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అన్నాచెల్లెళ్ళ అనురాగానికి నిలువెత్తు నిదర్శనం 'రక్తసంబంధం' కు 57 ఏళ్ళు

తోడబుట్టిన చెల్లెలి సుఖం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసే ఓ అన్నయ్య కథే ‘రక్తసంబంధం’ చిత్రం. అన్నాచెల్లెళ్ళ ప్రేమకు అపు`రూప`కల్పనగా రూపొందిన ఈ చిత్రరాజంలో అన్నయ్యగా మహానటుడు యన్.టి.రామారావు, చెల్లెలుగా మహానటి సావిత్రి ఆ యా పాత్ర‌ల‌కు ప్రాణ‌ప్ర‌తిష్ఠ చేశారు. తమిళ చిత్రం ‘పాశ‌మలర్’(1961)కి రీమేక్‌గా దిగ్గజ దర్శకులు వి.మధుసూదనరావు తెర‌కెక్కించిన ఈ చిత్రంలో కాంతారావు, దేవిక, రేలంగి, రమణారెడ్డి, గిరిజ, సూర్యకాంతం తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. ఈ చిత్రాన్ని రాజలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై డూండీ, సుందర్‌లాల్ నెహెతా సంయుక్తంగా నిర్మించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దండుపాళ్యం 4 మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆవిరి మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మీకు మాత్రమే చెప్తా మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మాజీ నక్సలైట్ దగ్గర సాయి పల్లవి శిక్షణ...

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్నట్టుగా తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'లాంత‌రు' గా లాలూ ప్ర‌సాద్ బయోపిక్

తెలుగు, హిందీ, తమిళ్ ఇలా పలు ఇండస్ట్రీల్లో ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనేతలు, క్రీడా ప్రముఖులు ఇలా చాలా మంది జీవిత చరిత్రలే తెరకెక్కాయి. ఇంకా చాలా మంది బయోపిక్ లు లైన్ లో వున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో రాజకీయ నాయకుడి బయోపిక్ తెరకెక్కబోతుంది. ఇంతకు ఆ రాజకీయనాయకుడు ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ అధినేత లాలూ ప్ర‌సాద్.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'నిన్నే పెళ్లాడతా' టాకీ పార్ట్ పూర్తి

రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ సింగ్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ వైకుంఠ బోను దర్సకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'నిన్నే పెళ్లాడుతా' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. గతకొద్ది కాలంగా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రూమర్లా..? నిజమా..? క్లారిటీ ప్లీజ్

గతకొద్ది కాలంగా రాజకీయాల్లోనే ఉన్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. క్రిష్ దర్శకత్వంలో నటించడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పవన్ తో ఓకె చెప్పడంతో క్రిష్ కూడా కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట. అంతేకాదు.. ఫోక్ జానర్ కి సంబంధించిన కథను పవన్ కోసం క్రిష్ సిద్ధంచేస్తున్నాడట.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నాకు భాష‌తో సంబంధం లేదు..!

నాకు భాష‌తో నాకు సంబంధం లేదు. న‌టించ‌డ‌మే నా పని అంటున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. బాహుబలి, సాహో సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు . ఇక ఇటీవలే బాహుబలి ఘనత లండన్ లో వాసులు కూడా చూసారు. లండ‌న్‌లోని రాయ‌ల్ ఆల్బ‌ర్ట్ హాల్‌లో బాహుబలి సినిమాను ప్రదర్శించగా.. అక్కడ కూడా బాహుబలి భళా అనిపించుకుంది. ఇక ఈ ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌నకి నటులు అనుష్క, ప్రభాస్ ఇంకా డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, నిర్మాత కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో హాలీవుడ్ సినిమాల్లో నటిస్తారా అని ప్రభాస్ ను అడుగగా.. మంచి స్క్రిప్ట్ దొరికితే హాలీవుడ్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

టాలీవుడ్ బిజీ హీరో

పెళ్ళి చూపులు మూవీ తో విజయం సాధించి , అర్జున్ రెడ్డి మూవీ ఘనవిజయంతో సెన్సేషనల్ హీరో గా మారి, బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీ తో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారారు . ఇప్పుడు నిర్మాతగా మారి సొంత ప్రొడక్షన్ హౌస్ కింగ్ ఆఫ్ ది హిల్ బ్యానర్ పై మీకు మాత్రమే చెప్తా మూవీ ని నిర్మించారు . మీకు మాత్రమే చెప్తా మూవీ నవంబర్ 1వ వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దర్శకుడు ఎస్పీ .రాజారామ్ మృతికి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సంతాపం

అక్టోబరు 24న మరణించిన ప్రముఖ దర్శకుడు ఎస్. పి.రాజారామ్ కు నివాళులు అర్పిస్తూ ఈరోజు తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అసోసియేషన్ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించింది. కృష్ణ-శ్రీదేవి జంటగా నటించిన" సమాజానికి సవాల్" చిత్రంతో దర్శకుడు గా కెరీర్ ప్రారంభించిన ఎస్ పి రాజా రామ్ తెలుగులో వదినగారి గాజులు, ముద్దాయి ముద్దుగుమ్మ వంటి విజయవంతమైన చిత్రాలతో పాటు హిందీలో ఘర్వాలి- బాహార్ వాలి, అభీ అభీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Team TFNవాట్సాప్
Khaidi Movie Box Office Collections, Khaidi Movie Collections, Khaidi movie latest collections, Khaidi Movie Worldwide Collections, Khaidi Telugu Movie Collections, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema
బాక్సాఫీస్

'ఖైదీ' టార్గెట్ 5 కోట్లు 5 రోజుల్లో వచ్చింది ఇది!

లోకేష్ క‌న‌గ‌రాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను... తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్ స‌మ‌ర్పించారు.ఇక దీపావళి కానుకగా అక్టోబర్ 25న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని సూపర్ హిట్ కొట్టింది. అన్నిచోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిసినెస్ తక్కువగానే జరిగిందని చెప్పొచ్చు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఈ మధ్య కార్తీకి సరైన హిట్ లేకపోవడంతో ఆ ఎఫెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా…

TFN Adminవాట్సాప్
KGF Chapter 1 About To Re Release In Bangalore,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,KGF Chapter 1 Movie Re Release in Bangalore,KGF Chapter 1 Movie Re Release Shows,KGF Movie Re Release Show Time
సినిమా వార్తలు

KGF చాప్టర్ 1 మూవీ రీ రిలీజ్

హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన గ్యాంగ్ స్టర్ డ్రామా KGF చాప్టర్ 1 కన్నడ మూవీ 2018 సంవత్సరం డిసెంబర్ లో రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. 250 కోట్లు కలెక్ట్ చేసి శాండల్ వుడ్ లో హైయెస్ట్ గ్రాసర్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ, , మలయాళ హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడ్డాయి. ఇప్పుడు KGF చాప్టర్ 1 మూవీ కి సీక్వెల్ KGF చాప్టర్ 2 మూవీ రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

భాస్కర్ ఒక రాస్కల్ మూవీ నవంబర్ విడుదల

కార్తికేయ మూవీస్ బ్యానర్ పై సిద్దిఖీ దర్శకత్వంలో అరవింద్ స్వామి, అమలాపాల్ జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ మూవీ భాస్కర్ ఒక రాస్కల్ నవంబర్ లో రిలీజ్ కానుంది. భాస్కర ఒరు రాస్కల్ తమిళ మూవీ కి తెలుగు డబ్బింగ్ వెర్షన్ భాస్కర్ ఒక రాస్కల్ మూవీ. నాజర్, నిఖిషా పటేల్, రోబో శంకర్, నైనిక ముఖ్య పాత్రలలో నటించారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్