తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా తమిళంలో వచ్చిన ‘అసురన్’ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. వెంకటేష్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇటీవలే దీనిపైఅధికారిక ప్రకటన చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ఈ రీమేక్ చేస్తున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా షారుక్ ఖాన్ కి బాగా నచ్చడంతో… ఈ సినిమా హిందీ రీమేక్ చేయాలనే ఆలోచనలో ఆయన వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మరి ఇవి కేవలం వార్తలేనా.. ఇందులో నిజం ఉండాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా షారుక్ తమిళ దర్శకుడు అట్లీతో కూడా ఒక సినిమా చేయాలనుకుంటున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి షారుఖ్ సౌత్ కథలపై ఇంట్రెస్ట్ చూపించడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: