హనీ ట్రాపర్‌గా `వింక్` బ్యూటీ?

Priya Prakash Varrier Plays Honey Trapper Role,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Priya Prakash Varrier Upcoming Movie,Priya Prakash Varrier New Movie Updates,Priya Prakash Varrier interesting Role in Upcoming Movie

ప్రియా ప్రకాష్ వారియర్… ఒక్క‌ కన్నుగీటుతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కేరళ కుట్టి. మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’(తెలుగులో ‘లవర్స్ డే’)తో హీరోయిన్‌గా పరిచయమైన ఈ వింక్ బ్యూటీ… ప్ర‌స్తుతం యంగ్ హీరో నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో రూపొందుతున్న‌ సినిమాలో నాయిక‌గా న‌టిస్తోంది. తెలుగులో త‌న‌కిదే తొలి చిత్రం కావ‌డం విశేషం. అంతేకాదు… ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌లో క‌నిపించ‌నుంద‌ట‌ ప్రియ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినిపిస్తున్న క‌థ‌నాల‌ ప్ర‌కారం… తన అందంతో, వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకర్షించి వారి నుంచి తనకు కావలసిన సమాచారాన్ని సేకరించే “హనీ ట్రాపర్” పాత్ర‌లో దర్శనమివ్వనుందట ప్రియ. కథను మలుపు తిప్పే ఈ పాత్రను దర్శకుడు చాలా చక్కగా డిజైన్ చేసాడని అంటున్నారు. మరి… తొలి చిత్రంలో కన్నుగీటుతో యువతను ఆకట్టుకున్న ప్రియ‌, “హనీ ట్రాపర్”గా ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. కాగా, ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌… 2020 ప్రథమార్థంలో తెరపైకి రానుంది.

`చ‌ద‌రంగం`, `ఏ 1` అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ చిత్రంలో నితిన్ చెస్ ప్లేయ‌ర్‌గా క‌నిపించ‌నుండ‌గా, ర‌కుల్ ప్రీత్ సింగ్ లాయ‌ర్‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ట‌.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 17 =