సౌదీ అరేబియాకు వెళుతున్న‌ అఖిల్ ?

Akhil Visits Saudi Arabia For His Movie Shooting,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Akkineni Akhil Visits Saudi Arabia,Akhil Movie Shooting in Saudi Arabia,Akhil Latest News 2019

అఖిల్ అక్కినేని హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అఖిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ట్టు సమాచారం. అంద‌మైన ప్రేమ‌క‌థ‌తో పాటు కుటుంబ బంధాల‌కు పెద్ద పీట వేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రంలో స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నాయికగా నటిస్తుండగా… గోపిసుందర్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి సంబంధించిన‌ తదుపరి షెడ్యూల్‌ను సౌదీ అరేబియాలో ప్లాన్ చేసిందట చిత్ర బృందం. దాదాపు పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో ఓ పాటతో పాటు పోరాట ఘ‌ట్టాల‌ను కూడా తెరకెక్కించనున్నట్టు సమాచారం.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్… 2020 ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − twelve =