లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, దిగ్గజ దర్శకుడు తాతినేని రామారావుది విజయవంతమైన జోడీ. వీరిద్దరి కలయికలో పలు చిత్రాలు తెరకెక్కగా… వాటిలో సింహభాగం విజయం సాధించడం విశేషం. అటువంటి సెన్సేషనల్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాల్లో ‘దొరబాబు’ ఒకటి. ఏయన్నార్‌కు జోడిగా మంజుల నటించగా… చంద్రకళ, కైకాల సత్యనారాయణ, జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, రాజబాబు, డి.రామానాయుడు తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సి.నారాయణరెడ్డి, ఆత్రేయ, దాశరథి, చెరుపు ఆంజనేయ శాస్త్రి, గోపి గీత రచన చేయగా… జె.వి.రాఘవులు వీనుల విందైన బాణీలు సమకూర్చారు. వాటిలో “దేవుడెలా ఉంటాడని” అనే పాట బాగా ప్రాచుర్యం పొందింది. అలాగే “రారా మా ఇంటికి”, “నీకు నాకు పెళ్ళంటే”, “అమ్మమ్మో ఈ గుంటడు”, “ఒంటరిగా ఉన్నాను” వంటి గీతాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. ఫణి మాధవి కంబైన్స్ బ్యానర్‌పై జె.సుబ్బారావు, జి.రాజేంద్రప్రసాద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. 1974 అక్టోబర్ 31న విడుదలైన ‘దొరబాబు’… నేటితో 45 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























