ఖైదీ మూవీ టీమ్ కు మహేష్ బాబు అభినందనలు

Mahesh Babu Congratulates Karthi Khaidi Movie Team,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Mahesh Babu Congratulates Khaidi Movie,Mahesh Babu Comments About Karthi Khaidi Movie,Karthi Khaidi Telugu Movie

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఖైదీ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఖైదీ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 25 వ తేదీ రిలీజయి రెండు భాషలలోనూ విజయఢంకా మ్రోగిస్తోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఖైదీ మూవీ ని సత్య సాయి ఆర్ట్స్ KK రాధామోహన్ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేశారు . హీరోయిన్, సాంగ్స్ లేకుండా నైట్ ఎఫెక్ట్ లో తెరకెక్కిన ఖైదీ మూవీ కి ప్రేక్షకాదరణ లభించింది . వసూళ్ళ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఖైదీ మూవీ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా వుండే సూపర్ స్టార్ మహేష్ బాబు ఖైదీ మూవీ పై తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. గ్రిప్పింగ్ స్క్రిప్ట్, న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్, థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్ , స్టెల్లార్ పెర్ఫార్మెన్సెస్, నో సాంగ్స్ , వెల్ కమ్ ఛేంజ్ అంటూ ఖైదీ మూవీ పై మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. మూవీ టీమ్ కు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. టాలీవుడ్ లో తాను సూపర్ స్టార్ గా
వెలుగొందుతున్నా , ఇతర హీరోల మూవీస్ ను ప్రశంసించడం మహేష్ బాబు మంచితనానికి నిదర్శనం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 19 =